Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాది పచ్చడిలో నవగ్రహ కారకాలు.. కొత్తబట్టలు తప్పనిసరి

telugu ugadi

సెల్వి

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (13:03 IST)
ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి. 
 
నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. ఉగాది రోజున విసనకర్రలు దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. 
 
ఉగాదిరోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం చేయాలి. నింబ కుసుమం అంటే వేప పువ్వు. నింబ పత్ర అంటే వేప ఆకు. ఇలాటి వాటిని తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది. దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి. 
 
ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-04-2024 సోమవారం దినఫలాలు - మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి...