హైదరాబాదులో హేపీగా వాలెంటైన్ డే కపుల్స్... అదుపులో 50 మంది దళ్ సభ్యులు...

శనివారం, 14 ఫిబ్రవరి 2015 (15:55 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ట్యాంకుబండ్ పైన, పబ్లిక్ పార్కుల్లో హేపీగా లవ్ కపుల్స్ తిరుగుతున్నాయి. ఇంతకుముందులా కపుల్ కనబడితే పెళ్లి చేసేస్తాం అనే భయం ప్రస్తుతం లేదు. ఎందుకంటే శనివారం ఉదయమే వాలెంటైన్ డే గ్రీటింగ్ కార్డులను తగులబెడుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను, ఇంకా పలుచోట్ల ప్రేమికులకు అడ్డు తగులుతారేమోనన్న అనుమానంతో 50 మంది దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 
దీంతో ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇప్పటివరకూ హైదరాబాదులోని ఏ ప్రేమజంటకు ఎలాంటి సమస్య తలెత్తలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు సైబరాబాద్ సీపి సీవీ ఆనంద్ పటిష్ట చర్యలు తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి