Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమికుల రోజు: ఈ చిట్కాలు పాటిస్తే మీ ప్రేమకు మీరు జీవం పోసినట్లే..!

ప్రేమికుల రోజు: ఈ చిట్కాలు పాటిస్తే మీ ప్రేమకు మీరు జీవం పోసినట్లే..!
, శుక్రవారం, 11 జనవరి 2013 (18:28 IST)
FILE
ప్రేమికుల రోజుకు ఇంకా ఒక నెల సమయం ఉంది. యంగస్టర్స్.. లవర్ కోసం వెతుకులాట ప్రారంభించివుంటారు. అలాగే మహిళలు కూడా తమ ప్రేమికుడు లేదా భర్తను ఆకట్టుకోవడం కోసం విలువైన కానుకలు సిద్ధం చేసుకుంటుంటారు. ప్రేమలో పడిన కొత్త జంటలు, ప్రేమలో పడిన పాత జంటలు, ఒంటరిగా ప్రేమ కోసం వేచి చూసే యువతకు లవర్స్ డే కోసం వేచి చూసే వారికి ఇవిగోండి కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే మీ ప్రేమకు మీరు జీవం పోసినట్లే..!

ప్రేమికుల రోజున షాపింగ్ మాల్స్, థీమ్ పార్కులు, థియేటర్లు, ఆలయాలు, పార్కులు, వీధులు లవర్స్‌తో నిండిపోతాయి. అలాంటి ప్రాంతాలకు మీ ప్రేయసి/ ప్రియుడుతో గడపాలనుకుంటున్నారా... లేదా కానుకలతో వారిని ఆకట్టుకోవాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి. ప్రేమలో పడితే ప్రేయసి కోసం తనను పూర్తిగా మార్చుకునే ప్రియుడు, కొద్దిరోజుల పాటే ఆమె "నా సర్వస్వం" అంటూ ఆరేడు నెలలు గడిచాక అవన్నింటిని పక్కనబెట్టేస్తే మాత్రం ప్రమాదం తప్పదు గురువా అంటున్నారు మానసిక నిపుణులు.

* ప్రేయసి/ ప్రియుడిని అప్పుడప్పుడు చిన్న చిన్న కానులతో ఆశ్చర్యపరచండి.

* గిఫ్ట్ ఇచ్చేది కొత్తగా వుండాలి. ఉదాహరణకు ఒక రోజ్ బొకేలో 12 ఎరుపు రోజాలుంటే ఒక తెలుపు రోజాను వుంచి ఇవ్వండి. ఆ తెల్ల రోజాలా నీవు ప్రత్యేకమని చెప్పండి.

* లవర్‌కు పుట్టినరోజు అంటే లవర్ తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెబుతూ గ్రీటింగ్స్ పంపండి. వీలైనంత వరకు లవర్‌తో ఎక్కువ సమయం వెచ్చించేలా చూడండి. యోగా, వాకింగ్, వ్యాయామం వంటివి ఇద్దరూ కలిసి చేయండి. మీ లవర్‌ను ఇతరులకు పరిచయం చేయడంలో జంకు కూడదు.

* ఒక విషయంపై నిర్ణయం తీసుకునే ముందు.. మీ లవర్ అభిప్రాయం కూడా తీసుకోండి. చేతులు పట్టుకుని సుతిమెత్తని స్పర్శతో మీ లవర్‌ను ఆకట్టుకోండి. అప్పుడప్పుడు మీ లవర్ భుజంపై వాలడం, చిలిపి చేష్టలు చేయడం వంటివి మర్చిపోవద్దు. ఎంత బిజీగా ఉన్న లవర్ కోసం సమయాన్ని కేటాయించండి.

* భవిష్యత్ కోసం ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఒకరికొరు వత్తాసు పలుకుతూ.. ప్రేమను వివాహం దాకా తీసుకెళ్తే మీ జీవితం ముగిసేంత వరకు ఆ ప్రేమ సుఖాంతం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu