Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్రేమికుల రోజు'... లవర్‌కు గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బుల్లేవ్... ప్చ్ ఏం చేయాలి..?!!

'ప్రేమికుల రోజు'... లవర్‌కు గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బుల్లేవ్... ప్చ్ ఏం చేయాలి..?!!
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2013 (12:54 IST)
WD
'ప్రేమికుల రోజు' వచ్చేస్తుంది... కుర్రాళ్లు తమ ప్రియురాళ్లకి ఎటువంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రేమికుల రోజు జీవితాంతం గుర్తిండిపోయేలా, ఓ మధుర అనుభూతిలా మిగలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి అంటున్నారు లవ్ గురులు.

1. ఈ ప్రేమికుల రోజు నాడు మీరు ఇచ్చే బహుమతి సింపుల్‌గా ఉండాలంటే ఒక గులాబీ పువ్వుల బోకే ఇచ్చి ఐలవ్‌ యూ చెప్పండి. గులాబీ ప్రేమకు చిహ్నం అని, గులాబీ ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అలాగే మన ప్రేమను కూడా అంత అందంగా తీర్చుదిద్దుకుందాం అని ఒక్క మాట చెప్పండి. దానితో మీ సింపుల్‌సిటి ఆమెకు నచ్చుతుంది.

2. ప్రియురాలికి ఇచ్చే బహుమతి కొత్తగా ఉండాలనుకుంటే ఆమె, మీరు కలిసి ఉన్న ఫోటోలతో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హార్ట్ టచ్చింగ్ లవ్‌సాంగ్స్ ఉండేటట్లు ఒక సీడీను తయారుచేసి ఇవ్వండి. ఆ ఫోటోలను ఆమె ముందు ప్లే చేసి ఐలవ్‌యూ చెప్పండి. దీని ద్వారా మనం తిరిగిన ప్రదేశాలు, కలిగిన అనుభూతులు ఎప్పటికి మరచిపోకుండా ఉండాలని ఈ గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పండి.

3. బడ్జెట్ ఎక్కువుగా ఉంటే ఏదైనా లవ్‌ సింబల్ ఉండేటట్లు నగలను కొనివ్వడం లేదా ప్రేమికుల ఇద్దరి పేర్లు ఉండేటట్లు ఒక రింగ్‌ను ఇచ్చి ఐ లవ్‌ యూ చెప్పండి. ఈ నగలు లేదా ఉంగరాలు నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటాను అని చెప్పండి. ఇవిధంగా మీ ప్రేమను వ్యక్తపరచండి.

4. మీ చెతిలో డబ్బులు లేవా...ఈ ప్రేమికుల రోజుకు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానే అని బాధ పడుతున్నారా...? ఎటువంటి బాధ పడకుండా ఒక ప్రేమ లేఖ రాయండి. అందులో మీ తొలి పరిచయం, మీ ఇద్దరు తిరిగిన ప్రదేశాలు, మరిచిపోలేని సంఘటనలు గురించి రాయండి. తద్వారా మీకు ఆమె ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకుని చెప్పడం ద్వారా ఆమెపై మీకున్న శ్రద్ద అర్థమౌతుంది.

పై నాలుగు విధాలలో మీరు ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ ప్రేమకుల రోజున మీ ప్రియురాలి ప్రేమను పొందండి.

Share this Story:

Follow Webdunia telugu