Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిబ్రవరి 14ను అమ్మా-నాన్నల రోజుగా జరుపుకోండి: శ్రీరామ్‌సేన

ఫిబ్రవరి 14ను అమ్మా-నాన్నల రోజుగా జరుపుకోండి: శ్రీరామ్‌సేన
, శనివారం, 11 ఫిబ్రవరి 2012 (16:32 IST)
WD
వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ప్రేమ జంటలు ఆ రోజు కోసం ఎలా ఎదురుచూస్తున్నాయో కానీ, శ్రీరామ్‌సేన మాత్రం ఆ రోజు కోసం పకడ్బంధీగానే ఎదురుచూస్తోంది. ఆ రోజు జరిగే అసభ్య కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇప్పటి నుండే తన కార్యకర్తలను సిద్ధం చేస్తున్నానని చెపుతోంది.

14వ తేదీన దేశంలో ప్రేమ పేరుతో పబ్లిక్‌గా పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో వేసే వెకిలీ వేషాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు కూడా జారీ చేసింది. వాలంటైన్స్‌ డేను ఒక పక్కదోవ పట్టిన పాశ్చాత్య సంస్కృతిగా శ్రీరామ్‌సేన అభివర్ణించింది. దాంతోపాటు పనిలో పనిగా, మన దేశంలో ఫిబ్రవరి 14ను అమ్మా-నాన్నల రోజుగా జరుపుకోవాలంటూ కూడా హితోక్తులు పలికింది.

"జమ్మూకాశ్మీర్‌తో పాటు, దేశంలోని తల్లిదండ్రులు, యువతరం మొత్తానికి ఇదే మా విన్నపం.. దయచేసి వేలంటైన్స్ డేను అమ్మా-నాన్నల దినోత్సవంగా జరుపుకోండి," అంటూ సేన జమ్మూ అధ్యక్షుడు రాజీవ్ మెహతా కోరారు. ప్రేమ పేరుతో జరిగే వెకిలీ వేషాలను మా కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారని భావించకండి, మా వాళ్లు దీన్ని నిరోధించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu