Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రాలనే ఇష్టపడతారు.. "జర్నీ" అంజలి

యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రాలనే ఇష్టపడతారు..
WD
మోడ్రన్ అమ్మాయిల ప్రేమ ఎలా ఉంటుందో జర్నీలో అంజలిని చూస్తే తెలుస్తుంది. ఇటీవల ఈ భామ చెన్నైలోని ప్రిన్స్ జ్యుయలరీలో మెల్లేమాయ్ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అంజలి తన భావాలను పంచుకుంది.

"యాక్చువల్లీ అమ్మాయిలు వజ్రపు ధగధగలతో నిండిన ఆభరణాలు ఇష్టపడతారు. నా మటుకు నేను వజ్రాల ఆభరణాలను అతిగా ఇష్టపడతాను. డైమండ్ ఆభరణాల్లో కొత్త మోడళ్లను చూస్తే వాటిని ధరించే దాకా ఉండలేను" అంటూ చెప్పింది అంజలి.

ఇకపోతే... ఈ వాలెంటైన్ సందర్భంగా ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా ప్రిన్స్ జ్యుయలరీ కొత్త కలెక్షన్లను అందుబాటులో ఉంచింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ జైన్ మాట్లాడుతూ.. తాము అందిస్తున్న వజ్రపు ఆభరణాలు కొత్త అందాలను ఇనుమడింపజేస్తాయన్నారు. అన్ని వయసుల వారికి తగినవిధంగా రూపొందినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu