Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలెంటైన్ వీక్... లవర్స్ ప్రేమ నిజమైనదా... లేక ఆకర్షణా...?

వాలెంటైన్ వీక్... లవర్స్ ప్రేమ నిజమైనదా... లేక ఆకర్షణా...?
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2013 (14:15 IST)
WD
వాలెంటైన్ వీక్ స్టార్ట్ అయింది. ప్రేమికుల రోజు కోసం యువతీయువకులు వెయిట్ చేస్తున్నారు. సహజంగా ప్రేమికులంటే ఓ లైలా మజ్నూ, దేవదాసు పార్వతి, షాజహాన్ ముంతాజ్‌లు టక్కున గుర్తుకు వస్తారు. అలాగని ప్రేమ కోసం వారిలా ఆత్మహత్యలు చేసుకోవడం, తాగుబోతుగా మారడం తాజ్ మహాల్‌లు కట్టనవసరం లేదు. అస్సలు ఇప్పుడు ప్రేమికుల ప్రేమ నిజమైందా, ఆకర్షణా అంటే వందకి 70 శాతం ఆకర్షణే అంటున్నారు లవ్‌గురులు. ఐతే ఇది నిజమో కాదో లవ్ పెయిర్స్‌ను అడిగితేనే అసలు విషయం తెలుస్తుంది.

అదలావుంచితే అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తారు. ప్రేమ అంటే రెండు మనస్సులు కలవాలి. ఒకరి భావాలు, ఇష్టాయిష్టాలు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. జీవితాంతం ప్రేమించిన వారితోనే గడపాలి. ఇవి క్రీస్తు పూర్వం మాటలు. కాని ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రేమ అనే పేరుకు అర్థమే మారిపోయింది. ప్రేమ అంటే రెండు శరీరాలు కలవాలి, ఎవరి ఇష్టాలు వారివే, నచ్చినంత కాలం ప్రేమించి లేదా సహజీవనం చేసి తర్వాత ఇంకొకరితో తమ ప్రేమను కొనసాగించడంలా మార్చేశారు.

నేటి యువత యావత్తు అంతా ఇప్పుడు ప్రేమలో మునిగితేలుతున్నారు. మనస్సుకు నచ్చిన అమ్మాయి కనబడగానే గుండె గంట కొట్టాలి అంటారు ప్రేమ పండితులు. అలాగని గంట కొడితే సరిపోతుందా...? ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు, వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా ప్రేమను వ్యక్తపరిస్తే చెంపపై 'బాటా' చెప్పు నంబరు పడటం ఖాయం. అందుకని నచ్చిన అమ్మాయితో పరిచయం పెంచుకోవడం, వారితో సన్నిహితంగా ఉండటం, వారి సుఖదుఃఖాలలో తోడుగా నిలువడం వలన అవతలి వారిలో మంచి అభిప్రాయం కలుగుతుంది.

అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తనకు సదరు పురుషుడు ఉన్నాడన్న ధైర్యం వాళ్లకు కలుగుతుంది. అలా మంచి అభిప్రాయం కలిగిన తరువాత ప్రేమను వ్యక్తపరచాలి. వెంటనే అంగీకరిస్తారు. ప్రేమను ఇరు కుటుంబసభ్యుల అనుమతితో పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితంలో సంతోషంగా ఉండగలరు. అలా ప్రేమను నిజమైన ప్రేమగా మలుచుకుని ఈ వాలెంటైన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu