Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తు: గుర్రాలు, ఎద్దులు, కల్పవృక్షం, పువ్వుల పెయింటింగ్స్ ఇంట్లో వుంటే?

వాస్తు: గుర్రాలు, ఎద్దులు, కల్పవృక్షం, పువ్వుల పెయింటింగ్స్ ఇంట్లో వుంటే?
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (15:27 IST)
ఇంట్లో అందమైన పెయింటింగ్స్ వుండాలని అందరూ కోరుకుంటారు. ఇల్లు లేదా కార్యాలయ స్థలాలకు పెయింటింగ్స్ అందాన్ని జోడిస్తాయి. పెయింటింగ్స్‌ను తగిన విధంగా ఎంపిక చేసుకుంటే ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయి. 
 
వాస్తు శాస్త్రం మన జీవితాల మొత్తం గమనాన్ని మార్చగల శక్తుల బదిలీకి సహాయపడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన పెయింటింగ్స్ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడతాయి. జీవితాల్లో సానుకూలతను తీసుకురావడానికి సహాయపడే పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం. 
 
వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రాలను శుభప్రదంగా భావిస్తారు. అవి స్థిరత్వం, ధైర్యం, శక్తి, బలం, విధేయతను సూచిస్తాయి. గుర్రాల పెయింటింగ్‌ను దక్షిణ దిశలో ఉంచడం అనేది ఒకరి జీవితంలోని అనేక భాగాలపై మంచి ప్రభావాన్ని చూపుతుందని వాస్తునిపుణులు అంటున్నారు. 
 
రన్నింగ్ గుర్రాలు జీవితంలో వేగం, విస్తరణ రెండింటినీ సూచిస్తాయి. నలుపు, తెలుపు లేదా గోధుమరంగు, తెలుపు రంగుల గుర్రాలు సానుకూలతను ప్రసాదిస్తాయి. 
 
పూల పెయింటింగ్‌లు వాస్తు ప్రకారం అదృష్ట పెయింటింగ్‌లుగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి సానుకూల భావాలను ప్రేరేపిస్తాయి. ప్రాణశక్తిని ఆకర్షిస్తాయి. ఫెంగ్‌షుయ్‌లో కూడా పువ్వులు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. నీటికలువల ఫోటోలు వాడవచ్చు.
 
వాటర్ లిల్లీలను ఏ దిశలోనైనా ఉంచవచ్చు. పడకగదిలో వుంచవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కలువల బొమ్మలు ఆనందం, సామరస్యం, శాంతిని సూచిస్తాయి. వాటిని పడకగదిలో ఉంచడం వల్ల ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.
 
ఎద్దుల పెయింటింగ్స్ వాస్తు ప్రకారం మంచి ఫలితాలను ఇస్తాయి. ఎద్దులు సాధారణంగా శక్తి, బలం, వేగం, ఆశావాదాన్ని సూచిస్తాయి. పెరుగుతున్న శ్రేయస్సును అందిస్తుంది. 
 
ఎద్దుల ఈ శక్తివంతమైన పెయింటింగ్ విజయాన్ని అందించడమే కాకుండా ఇతరుల చెడు ఉద్దేశాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
 
వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో నంది ఎద్దు లేదా పెయింటింగ్‌ను కలిగి ఉండటం వలన ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. 
 
మీ ఇంట్లో కామధేను శిల్పం లేదా పెయింటింగ్ ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దీనిని ఈశాన్య దిశలో ఉంచడం వలన మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. సంపద- సంతోషం లభిస్తుంది.
 
కల్పవృక్షం వాస్తు ప్రకారం మంచి ఫలితాలను ఇస్తుంది. కల్పవృక్షం స్వచ్ఛత, సంతానోత్పత్తిని కూడా సూచిస్తుంది. ఈ కళాఖండాన్ని వాయువ్య దిశలో ఉంచడం వలన అది మీ గది, కార్యాలయ స్థలం, వాణిజ్య స్థలం లేదా డ్రాయింగ్ గది అయినా మీ స్థలం సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రి 2023: 12 రాశులు.. అభిషేక పదార్థాలు