Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయక చవితి.. పూజలో ఉండ్రాళ్ళు తప్పకుండా ఉండేలా చూసుకోండి.

వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుని పూజకు కావలసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగురవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచా

వినాయక చవితి.. పూజలో ఉండ్రాళ్ళు తప్పకుండా ఉండేలా చూసుకోండి.
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:28 IST)
వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని పూజకు కావలసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగురవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు. 
 
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూడా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. 
 
వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టిపాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. 
 
దానిలో కొన్ని అక్షతలు, పూలువేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నియమ ప్రకారం పూజ, దీపారాధన, నైవేద్యాలు సమర్పించుకోవాలి.
 
అలాగే పత్రి పూజతో వినాయకుడి అనుగ్రహం పొందండి. 21 పత్రాలతో పూజ చేయడం ద్వారా నేత్ర, మూత్ర, చర్మ సంబంధిత రోగాలు దూరమవుతాయి.  వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైరతాబాద్ మహాగణేశునికి భారీ ల‌డ్డూ... బెజ‌వాడ‌లో త‌యారు...