Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల ఆరోగ్యం... అధికార హోదాలు..

ఉన్నత పదవులు లేడీ బాస్ వంటి అధికారంలో ఉండే మహిళలకు కుంగుబాటు తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ వాతావరణంలో పెద్దస్థాయికొచ్చిన మహిళలు రకరకాల మాటలు పడాల్సి వస్తుంది. అయితే ఆ స్థాయి

మహిళల ఆరోగ్యం... అధికార హోదాలు..
, బుధవారం, 27 జూన్ 2018 (16:42 IST)
ఉన్నత పదవులు, అధికారంలో ఉండే మహిళలకు కుంగుబాటు తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ వాతావరణంలో పెద్దస్థాయికొచ్చిన మహిళలు రకరకాల మాటలు పడాల్సి వస్తుంది. అయితే ఆ స్థాయికి వెళ్లడానికి మహిళలు మానసికంగా ఆరోగ్యపరంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. దానినే మానసిక కుంగుబాటు అంటారు.
 
అధికార హోదా మగవాళ్లకు ఆత్మవిశ్వాసాన్నీ సమాజంలో ఉన్నత హోదానీ అందిస్తే మహిళల్లో మాత్రం అది మానసికంగా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తోందని పరిశోధనలో వెల్లడైంది. స్త్రీల మానసిక అనారోగ్యానికి కారణమయ్యే అంశాలపై జరిపిన పరిశోధనలో అధికార హోదాలో ఉండే మహిళల్లో మానసిక కుంగుబాటు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
 
మహిళలు పెద్ద స్థాయికి చేరుకోవాలంటే మగవారికన్నా మహిళలు ఎంతో పోరాడవలసి వస్తోంది. కుటుంబంలో, కార్యాలయంలో అనేక వివక్షల్నీ, అసూయల్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి. ఆ క్రమంలో మనస్సులో ఏర్పడే ఆవేదనలే కుంగుబాటుకి కారణం అవుతున్నాయి.  
 
దీని నుండి బయటపడాలంటే వీలు కుదిరినప్పుడల్లా బాధ్యతల్ని పక్కనపెట్టి తమపై తాము శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత ఆసక్తులకు, వ్యాయామానికి సమయం కేటాయించాలని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాయ్‌లెట్‌లో స్మార్ట్‌ఫోనా? అబ్బే..?