Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాలో నటించిన తొలి కలెక్టర్.. ఎవరామె?

తిరువనంతపురం సబ్-కలెక్టర్ దివ్య ఐయ్యర్ ఐఏఎస్ నటిగా మారారు. పెన్నీ ఆసంబా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎలి అమ్మచ్చిట్టె అనే క్రైస్తవ మలయాళ సినిమాలో ఆమె కన్యాస్త్రీగా కనిపించనుంది. ఈ చిత్రం శుక్రవారం ర

సినిమాలో నటించిన తొలి కలెక్టర్.. ఎవరామె?
, గురువారం, 30 నవంబరు 2017 (14:57 IST)
తిరువనంతపురం సబ్-కలెక్టర్ దివ్య ఐయ్యర్ ఐఏఎస్ నటిగా మారారు. పెన్నీ ఆసంబా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎలి అమ్మచ్చిట్టె అనే క్రైస్తవ మలయాళ సినిమాలో ఆమె కన్యాస్త్రీగా కనిపించనుంది. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఐఏఎస్‌, డాక్టర్ అయిన దివ్య అయ్యర్ ఈమె తమిళనాడు వేలూరులోని సీఎంసీలోనే చదివారు. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. సామాజానికి మేలు చేసే సినిమా కావడంతోనే ఇందులో నటించానని చెప్పింది. ఈ సినిమా ద్వారా సమాజానికి సందేశాన్నిచ్చేదిగా వుంటుందనే నమ్మకంతో దర్శకుడు అడిగిన వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. ఇందుకు తోడు తాను ఐఏఎస్ అధికారి కావడంతో పద్ధతి ప్రకారం ప్రభుత్వ అధికారుల వద్ద అనుమతి పొందాకే ఈ చిత్రంలో నటించానని చెప్పారు. 
 
ఐఏఎస్ అధికారి సినిమాల్లో నటించకూడదనే చట్టం లేదు. ఈ చిత్రంలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించానని వెల్లడించారు. మలయాళ, తమిళ సినిమాలు చూస్తూ వుంటానని.. మెర్సల్, విక్రమ్ వేదా చూశానని.. నయనతార నటించిన అరమ్ ఇంకా చూడలేదని చెప్పారు. ఆ సినిమా బాగుందని విన్నాను. తప్పకుండా ఆ సినిమా చూస్తానని తెలిపారు. 
 
మెర్సల్ వంటి సినిమాల్లో సామాజిక సందేశం వుందని, అరమ్ కూడా ఇలాంటిదేనని చెప్పుకొచ్చారు. కాగా ఓ కలెక్టర్ సినిమాల్లో కనిపించడం ఇదే తొలిసారి. ప్రజలకు మంచి సందేశాన్నిచ్చే సినిమాలో ఆమె నటించడం పట్ల నెటిజన్లు దివ్య ఐయ్యర్ పట్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్తవ్యాన్ని పూర్తి చేసి... సహనానికి ఆశ్రయం ఇవ్వు...