మహిళలూ... మీరు తులా, వృశ్చిక లగ్నంలో జన్మించారా?

Webdunia
బుధవారం, 14 మే 2014 (17:50 IST)
File
FILE
తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగం, వృత్తిపరంగా ముందంజలో నిలుస్తారు. ఇందులో తులా లగ్నంలో జన్మించిన మహిళా జాతకులు బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యాన్ని పూర్తి చేసే వరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎలాంటి క్లిష్టతరమైన కార్యాన్నైనా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.

ఇతరులు చేసే పనిని ఒకసారి చూసిన వెంటనే దాన్ని తిరిగే చేసే నైపుణ్యం కలిగి ఉండే ఈ జాతకులు, ఇతరుల పట్ల గౌరవభావంతో ప్రవర్తిస్తారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. భూములు, వాహనాలు కొనడంలో ఆసక్తి చూపుతారు. జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కొంటారు. బంధువులు, స్నేహితుల వద్ద స్నేహభావంతో ప్రవర్తిస్తారు.

ఇక వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళా జాతకులు ఆగ్రహావేశులుగా ఉంటారు. ఇతరుల వద్ద కఠినంగా ప్రవర్తిస్తారు. ఇతరుల ఆధీనంలో పనిచేయడంలో ఏ మాత్రం ఆసక్తి చూపరు. వీరికి కళత్ర స్థానం గొప్ప స్థానంగా అమరి ఉండటంతో భాగస్వామ్య జీవనం సుఖమయంగా ఉంటుంది. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉంటారు.

అయితే ఆర్థికపరంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాధుల వలన కొన్ని కష్టాలు ఏర్పడటం జరుగుతుంది. ఆర్థిక పరమైన వ్యయాల్లో కాస్త పొదుపును పాటించడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా తులాం, వృశ్చిక లగ్నంలో జన్మించిన జాతకులు ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపమెలిగిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నేను అలాంటి వారి ఇళ్లలో వుంటానని చెప్పిన శ్రీ మహాలక్ష్మి

వేప నూనెతో దీపాలను వెలిగిస్తే.. లాభాలేంటో తెలుసా? (video)

శివుడు శ్మశానంలో కొలువైవుండటానికి కారణమేంటి?

డిన్నర్‌కు వస్తావా? అని అడుగుతారు.. ఆ రోజు రాత్రి అంతే..(Video)

పదో తరగతి బాలికను అలా తాకాడు... ఏం చేసిందంటే...?

ఎఫ్ 2 సినిమాని దిల్ రాజు అక్క‌డ కూడా తీస్తాడా.?

కంగనా రనౌత్.. క్రిష్‌‌ల వాట్సాప్ మెసేజ్‌లను బయటపెట్టిన రంగోలి.. ఏముంది?

గోధుమ పిండి పరోటాలు ఎలా చేయాలో తెలుసా?

గోపీచంద్ మూవీలో ఆ హీరోయిన్‌కి ఛాన్స్ ఇచ్చారా..?

హనీకి కోపం తెప్పించిన దిల్ రాజు.. ఎందుకు?

స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?

ఇంట్లో జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది...

భీష్మ ఏకాదశి.. విష్ణు సహస్ర నామాలు పుట్టినరోజు..

ఆఫీసుల్లో డైనింగ్ టేబుళ్లు... పాదరక్షలతో భోజనం చేస్తున్నారా..?

ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?