Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 ఓవర్లలోనే ఇంగ్లండ్ భరతం పట్టిన భారత బౌలర్లు... కోహ్లీ సేన ఘన విజయం

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు విజయభేరీ మోగించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫలితంగా ఇం

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (16:17 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు విజయభేరీ మోగించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు చిత్తుకాగా, మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.
 
ఐదోరోజైన బుధవారం రోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 317 పరుగుల దగ్గర చివరి వికెట్ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 
 
ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లి సేన. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5, ఇషాంత్ 2, షమి, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు విరాట్ కోహ్లీకి ద‌క్కింది. సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. 
 
ఈ గెలుపుతో తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమిపాలైన భారత్.. మూడో టెస్టులో మాత్రం ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో హార్డిక్‌ పాండ్యా ఆతిథ్య జట్టు నడ్డి విరవగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను బుమ్రా తన భుజానికెత్తుకున్నాడు. 521 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్‌, గంట తిరిగే సరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కుక్‌, రూట్‌లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్‌లు ఔటైపోవడంతో తొలి రెండు సెషన్లలోపే ఆట ముగిసిపోతుందనుకున్నారు.
 
కానీ, బట్లర్‌, స్టోక్స్‌ జోడీ భారత్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆపై బుమ్రా మ్యాజిక్ కొనసాగింది. టపటపా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను పతనం అంచుకు చేర్చాడు. దీంతో నాలుగో రోజే భారత్‌ విజయంతో ఆట ముగిస్తుందని అభిమానులు ఆశించినా, 9 వికెట్లు మాత్రమే పడ్డాయి. విజయానికి భారత్ ఒక వికెట్‌ దూరంలో నిలిచింది.
 
సంక్షిప్తంగా స్కోర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌-329
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌-161
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌-352/7
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌-317 
మ్యాచ్ ఫలితం : 203 రన్స్ తేడాతో భారత్ గెలుపు. 

సంబంధిత వార్తలు

గానుగ నూనె వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిది, వైద్యులు ఏమంటున్నారు?

టైటానిక్ సినిమాలో రోజ్‌ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు

మద్యం మత్తులో మైనర్‌పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?

బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... టీడీపీ పెండింగ్ అభ్యర్థులపై క్లారిటీ!

బస్సు యాత్ర తొలి రోజే తుస్సుమన్నదా? వైకాపా నేతల్లో చర్చ? పార్టీ నేతలపై సీఎం జగన్ మండిపాటు!?

త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా టిల్లు స్క్వేర్ కి హెల్ప్ అవుతాయి: సిద్ధు జొన్నలగడ్డ

రోడ్డు ప్రమాదం: నవీన్ పోలిశెట్టికి చేయి విరిగిందా?

శర్వానంద్... మనమే నుండి యువత కోసం లండన్‌ లో చిత్రికరించిన సాంగ్ విడుదల

రజనీకాంత్ కోసం జక్కన్నలా మారిన కనకరాజ్

సిద్ధుతో వైవాహిక జీవితంలో ప్రవేశించానని ప్రకటించిన అదితిరావ్ హైదరీ

తర్వాతి కథనం
Show comments