మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఆవు పేడతో సమానం- కోచ్ రవిశాస్త్రి

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, రెండేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్‌లో వున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:10 IST)
టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, రెండేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్‌లో వున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్నారని జాతీయ మీడియా కోడైకూసింది. ఈ వార్తలపై ఇప్పటికే సినీ నటి నిమ్రత్ కౌర్ ఫైర్ అయ్యింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. 
 
 
 
అంతేగాకుండా.. రవిశాస్త్రితో ప్రేమాయణం గురించి వార్తలు తనను ఎంతో బాధించాయని నిమ్రత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మీడియాలో తనకు, నిమ్రత్‌కు లింకుందనే వస్తున్న వార్తలపై రవిశాస్త్రి మండిపడ్డారు. ఆ వార్తలన్నీ ఆవు పేడతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒంటరిగానే ఉన్నానని.. ప్రేమ కోసం వెంపర్లాడడం లేదని తేల్చి చెప్పేశారు. 
 
నిమ్రత్‌ ప్రస్తుతం ఆల్ట్‌ బాలాజీ సంస్థ నిర్మిస్తున్న ది టెస్ట్‌ కేస్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. రవిశాస్త్రి ఇంగ్లండ్‌లో జరుగుతున్న సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ లింకు పెడుతూ వస్తున్న వార్తలపై రవిశాస్త్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
మూడేళ్ల క్రితం ఓ జర్మనీ కంపెనీ తనను, నిమ్రత్‌ను వారి కార్ల ప్రచారం నిమిత్తం ఎంచుకుందని, ఆ సమయంలోనే తామిద్దరికీ పరిచయం ఏర్పడిందని చెప్పిన రవిశాస్త్రి, తాము కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నామని అంతకు మించి మరేమీ లేదని క్లారిటీ ఇచ్చేశారు.

ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటో.. సచిన్ పొరపాటు

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు.. ఆసియా కప్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

అక్కినేని కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చిన చైతు, సమంత...

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నామినేషన్ వేస్తా... చిత్తవుతాడు... శ్రీరెడ్డి సవాల్

సంబంధిత వార్తలు

ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటో.. సచిన్ పొరపాటు

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

అట్ల తద్దె రోజున ఉమాదేవిని పూజిస్తే..?

శివనామాన్ని స్మరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

తర్వాతి కథనం