Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

తెలంగాణ శాసనసభను సీఎం కేసీఆర్ ఈ నెల ఆరో తేదీన రద్దు చేసుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిద్ధంగా లేనట్టు

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:50 IST)
తెలంగాణ శాసనసభను సీఎం కేసీఆర్ ఈ నెల ఆరో తేదీన రద్దు చేసుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ఆరో తేదీన అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకునే ఛాన్సుందని అందరూ అనుకున్నా.. ఆ గడువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోలేమని ఈసీ తేల్చి చెప్పేసిందని టాక్. 
 
నిర్ణీత గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కానీ సెప్టెంబర్‌లో శాసనసభను రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరిలో నిర్వహించాల్సి వస్తుంది. నిర్ణీత గడువుకు, దీనికి మధ్య వ్యవధి పెద్దగా లేదు. అందుకే ఈసీ ఏర్పాట్లు కష్టమని చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే, డిసెంబర్ నాలుగు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదని ఈసీ భావిస్తోంది. 
 
మరోవైపు నవంబర్-డిసెంబర్లలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సి వుంది. ఈ స్థితిలో ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు విడిగా చేసుకోవాల్సి వస్తుంది. 
 
ఓ ఎన్నికల ఫలితాల ప్రభావం మరో ఎన్నికలపై పడకుండా చూడడానికి తగిన వ్యవధిని ఈసి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వెంటనే మరో ఎన్నికను నిర్వహించడం సాధ్యం కాదని ఈసీ భావిస్తోంది. ఈ స్థితిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం ఎన్నికలతో పాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించడానికి ఈసి ఏ మాత్రం సంసిద్ధంగా లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు

నా శరీరంలో వంద కుట్లున్నాయి, రత్నం కచ్చితంగా పైసా వసూల్ : హీరో విశాల్

రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

దేవరలో స్టెప్పులేయనున్న పూజా హెగ్డే?

ఇంతటితో నా జీవితం ముగిసింది: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి చివరి పోస్ట్

తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments