మొలకెత్తిన సజ్జలు.. బొజ్జను తగ్గిస్తాయట..

మొలకెత్తిన సజ్జలను తింటే బొజ్జ ఇట్టే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన సజ్జలను పిండి కొట్టుకొచ్చి పెట్టుకోవడం.. ఆ పిండితో జావ, లేదా రొట్టెలను కాల్చుకుని తీసుకోవడం ద్వారా పొట్ట కరి

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:17 IST)
మొలకెత్తిన సజ్జలను తింటే బొజ్జ ఇట్టే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన సజ్జలను పిండి కొట్టుకొచ్చి పెట్టుకోవడం.. ఆ పిండితో జావ, లేదా రొట్టెలను కాల్చుకుని తీసుకోవడం ద్వారా పొట్ట కరిగిపోతుందని వారు సూచిస్తున్నారు. మొలకెత్తిన సజ్జల్లో ప్రోటీన్లు అనేక రెట్లు వృద్ధి చె౦దుతాయి. అందుకే మొలకెత్తిన సజ్జలను వాడటం ఆరోగ్యానికి ఎంతో క్షేమదాయకం.
 
బియ్యంపిండితోనూ, గోధుమపిండితోనూ చేసుకునే వంటకాలన్నింటినీ సజ్జపిండితో కూడా చేసుకోవచ్చు. పెసలు సజ్జలు కలిపి నానబెట్టి రుబ్బి పెసరట్టులా వేసుకుని తీసుకోవచ్చు. సజ్జల పిండి ఆరోగ్యానికి రుచికి జీర్ణశక్తికి మంచిది. సజ్జ బూరెలు, సజ్జ గారెలు, సజ్జ చక్కిలాలు, సజ్జ చేకోడిలూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో చేకూరుతుంది. 
 
సజ్జపాయస౦, సజ్జజావతో చెసిన సూపు తేలికగా అరిగేవిగా ఉ౦టాయి. ఉప్మాని బొ౦బాయి రవ్వతో కాకుండా మొలకెత్తిన సజ్జల రవ్వతో ఉప్మా చేసి పిల్లలకు తినిపించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సజ్జలతో గారెలు వేసుకొ౦టే నూనె పీల్చకు౦డా వుంటాయి. సజ్జల్లో ప్రొటీను, రాగుల్లో కేల్షియ౦ ఎక్కువగా ఉ౦టాయి. కాబట్టి, ఈ రె౦డి౦టినీ కలిపి వాడుకొ౦టే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

40 సంవత్సరాలు పైబడిన పురుషులు శనగ పిండి వాడితే...

రాళ్ల ఉప్పు బరువును తగ్గిస్తుందట.. తెలుసా?

చక్కనైన నడుము కోసం కష్టమైన ఎక్సర్‌సైజులు అవసరంలేదు...

మాంసం ఆరగించి ఆలయాలకు ఎందుకు వెళ్లరాదు?

నా మెడలో తాళి కట్టాలని చూశాడు.. నా బిడ్డలే అందుకు సాక్ష్యం: నీలాణి

సంబంధిత వార్తలు

వైసీపీలో వంగవీటి ముసలం... రాధా పార్టీ మారతారా?

వద్దమ్మా రాములమ్మా.. నీకో పెద్ద దణ్ణం... ఎవరు?

బిగ్ బాస్‌లో ఓటింగ్ అక్రమాలా? ఎలా సాధ్యం..?

హ‌లో గురు ప్రేమ కోస‌మే.. చాలా హాట్‌గా ఉంది..!

తర్వాతి కథనం