Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకి నాలుగు కరివేపాకులను నమిలి తింటే...?

మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు చే

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (19:57 IST)
మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కరివేపాకు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఈ కరివేపాకు ఆకులను తినడం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగాసహాయపడుతుంది.
 
2. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకుంటే... ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
 
3. కరివేపాకులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తినడం వల్ల కళ్లకు సంబందించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటిచూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
4. వెంట్రుకలు రాలడం, పలుచబడడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివేపాకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
 
5. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటుని నివారిస్తుంది.
 
6. అలాగే కరివేపాకుని ఒక మంచి సౌందర్య సాధనంగా కూడా చెప్పవచ్చు. కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, చర్మపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments