పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:48 IST)
సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబిడ్డ గొంతులో ఉప్పు పోసి చంపేసింది. ఈ దారుణం బంగ్లాదేశ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ బిచ్చు, సాతీ అనే దంపతులకు మూడేళ్ళ రెండేళ్ళ బాలుడు ఉన్నాడు. ఈ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిచ్చు ఇటీవల పని మానేసి ఇంట్లో కూర్చోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు సాతీ డబ్బు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టేసి చల్లగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని చెబుతూ పిడికిలి నిండా ఉప్పును చిన్నారి గొంతులో పోసేసింది. ఆ పని చేసిన కొద్దిసేపటికే చేసిన తప్పు తెలుసుకుంది. వెంటనే పిల్లాడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చారు. కాగా, ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో సాతీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమృత కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన సమంత..?

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

వివాహితుడు.. కానీ 17 ఏళ్ల యువతితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగేశారు..

హౌస్‌మేట్స్ అంతా కుక్కలు.. నోరు పారేసుకున్న కౌశల్, బయట కౌశల్ ఆర్మీ

పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే?

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

మొన్నేమో బిర్యానీలో గొంగలి పురుగు.. నిన్నేమో చాక్లెట్‌ కేక్‌లో బొద్దింక

అమృత కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన సమంత..?

తర్వాతి కథనం