వణికిస్తున్న ఫ్లోరెన్స్... అమెరికాను ముంచెత్తనున్న వరదలు

అమెరికాను ఫ్లోరెన్స్ వణికిస్తోంది. ఫలితంగా అమెరికా మరోమారు వరదల్లో చిక్కుకోనుంది. ఫ్లోరెన్స్ హరికేన్ ఫలితంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు వి

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:09 IST)
అమెరికాను ఫ్లోరెన్స్ వణికిస్తోంది. ఫలితంగా అమెరికా మరోమారు వరదల్లో చిక్కుకోనుంది. ఫ్లోరెన్స్ హరికేన్ ఫలితంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు విరిగి పడతాయని అమెరికా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది.
 
ఈ ఫ్లోరెన్స్ హరికేన్ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడి తూర్పు తీరం వైపు నెమ్మదిగా కదులుతోంది. ఈ హరికేన్ కేటగిరీ-1 కిందకు చేర్చారు. దీనిఫలితంగా తీవ్రముప్పు పొంచివున్నట్టు భావిస్తున్నారు. ఇదిక్రమంగా బలం పుంజుకుని, రాగల 24 గంటల్లో కేటగిరీ-4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని అమెరికాలోని జాతీయ హరికేన్‌ కేంద్రం (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. 
 
ఈ కారణంగా తూర్పు తీరప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, కొండచరియలు విరిగి పడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం బెర్ముడాకు 1100 కిలోమీటర్లు ఆగ్నేయంగా హరికేన్‌ కేంద్రీకృతమై ఉందని, గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఉత్తర, దక్షిణ కరోలినా మధ్య ఇది తీరం దాటవచ్చునని తెలిపింది. 

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

వినాయకుడు అందంగా వున్నాడని చూసేందుకు వెళ్తే.. ఆ మండపం వెనుక?

నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

విమానంపై పేరును తప్పుగా పెయింటిగ్... తిరిగి పంపించిన ఎయిర్ లైన్స్...

పాముతో శునకం ఢీ.. పప్పీలను కాటేసిన నాగుపాము

తర్వాతి కథనం