Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించానని లొంగదీసుకున్నాడు.. ఆపై స్నేహితులతో పడక పంచుకోమని?

ప్రేమించిన పాపానికి యువతిని బెదిరించాడు. లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా స్నేహితులతో కూడా గడపాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (18:41 IST)
ప్రేమించిన పాపానికి యువతిని బెదిరించాడు. లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా స్నేహితులతో కూడా గడపాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే... పెళ్లి చేసుకొంటానని చెప్పి నమ్మించి తనను లోబర్చుకొన్న ధరన్ షా అనే వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కెనడా వెళ్లేందుకు సహకరిస్తానని.. అందుకు తన స్నేహితులతో కూడా పడక పంచుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాదు ఈ నెల 3వ తేదీన నిందితుడు తనపై తొలిసారిగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై దాడికి దిగాడని చెప్పింది. 
 
పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను లోబర్చుకొన్న నిందితుడు పెళ్లి ప్రస్తావన రాగానే తనను బ్లాక్ మెయిల్  చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇప్పటివరకు తన నుంచి రూ.3లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు నగల్ని, ల్యాప్‌టాప్‌ను తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
 
ఇంకా తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు, రాజమౌళి కలయికతో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్

నల్గొండ లో క్లైమాక్స్ చిత్రీకరణ చేయనున్న పోలీస్ వారి హెచ్చరిక

జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ పాడిన లచ్చిమక్క పాటకు అనూహ్య స్పందన

టీఆర్పీ రేటింగ్‌ను కుమ్మేసిన గుంటూరు కారం..

పుష్ప: ది రైజ్‌తో అదిరే రికార్డులు.. హిందీ రైట్స్ రూ.200కోట్లు

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం