Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ.. ఛీ... మీ అమ్మాయి వాట్సాప్ తెగ చూస్తోంది... మాకొద్దు: ఆగిపోయిన పెళ్లి

ఓ పెళ్లి వాట్సాప్ కారణంగా ఆగిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనుందనగా వరుడి తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులకు ఫోన్లో మీ అమ్మాయి విపరీతంగా వాట్సాప్ యూజ్ చేస్తోంది... ఇలాంటి అమ్మాయి పెళ్లయ్యాక ఇక ఏం చేస్తుందీ అంటూ తమ అబ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:22 IST)
ఓ పెళ్లి వాట్సాప్ కారణంగా ఆగిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనుందనగా వరుడి తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులకు ఫోన్లో మీ అమ్మాయి విపరీతంగా వాట్సాప్ యూజ్ చేస్తోంది... ఇలాంటి అమ్మాయి పెళ్లయ్యాక ఇక ఏం చేస్తుందీ అంటూ తమ అబ్బాయికి ఆమెను ఇచ్చి పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు. దీనితో పెళ్లి ఆగిపోయింది. 
 
దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే... ఉత్తర్‌ప్రదేశ్‌లో అమ్రోహ జిల్లాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో నౌగాన్ సాదత్ ప్రాంతానికి చెందిన వధువుకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి సెప్టెంబరు 5న చేయాలని నిశ్చయించారు. పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగుతుందనగా పెళ్లి ఏర్పాట్లపై వధువు తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఫోన్లో వాళ్లు చెప్పిన మాటలు విని వీరు షాకయ్యారు. 
 
మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేసుకునేందుకు మాకు ఎంతమాత్రం ఇష్టం లేదనీ, వధువు ఎక్కువగా వాట్సాప్‌ను వినియోగించడం చూసి షాక్ తిన్నామనీ, అలాంటి అమ్మాయి మా ఇంటికి వచ్చాక ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. అందువల్ల తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నారు. ఐతే వధువు తల్లిదండ్రులు మాత్రం మరోలా చెపుతున్నారు. వరుడి కుటుంబం అదనపు కట్నం అడిగిందనీ, తమకు రూ. 65 లక్షలు ఇస్తే ఒప్పుకుంటామని చెప్పారనీ, అందుకు తాము అంగీకరించనందువల్లనే ఇలా వాట్సాప్ అంటూ కొత్త మెలిక పెట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

ఆది సాయి కుమార్ నూతన చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం

సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తాను : దర్శకుడు శేఖర్ కమ్ముల

కళింగ యుద్ధం తరువాత వెల్లడైన దైవ రహస్యం నేపథ్యంలో మిరాయ్ గ్లింప్స్ రిలీజ్

అతడిని గట్టిగా హగ్ చేసుకుని హాయిగా నిద్రపోతాను: బిగ్ బాస్ అశ్విని

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ!!

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments