ముక్కుపుడకను ఎలా ధరించుకోవాలంటే?

స్త్రీల సౌందర్యం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కనుముక్కుతీరు చాలా బాగుందని చెప్పుకుంటారు. స్త్రీల సౌందర్యంలో ముక్కు ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ కారమంగానే ఎంతో కవులు ముక్కును ఎన్నో రకాలుగా వర్ణిస్త

Webdunia
బుధవారం, 18 జులై 2018 (12:19 IST)
స్త్రీల సౌందర్యం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కనుముక్కుతీరు చాలా బాగుందని చెప్పుకుంటారు. స్త్రీల సౌందర్యంలో ముక్కు ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ కారమంగానే ఎంతో కవులు ముక్కును ఎన్నో రకాలుగా వర్ణిస్తూ పాటలు, పద్యాలు రాశారు.
 
అప్పట్లో ప్రతి యువతి ముక్కెర ధరించడమనేది ఒక ఆచారంగా వచ్చింది. ఈ క్రమంలో అడ్డబేసరి కూడా ఎక్కువగానే ధరించేవారు. అయితే ఈ ముక్కెర అనేది అతివల అందం పెంచడానికే కాదు వారి ఆరోగ్యాన్ని కాపాడే అలంకారమని శాస్త్రం చెబుతోంది. ఎడమ శ్వాసను చంద్ర స్వరమని, కుడి శ్వాసను సూర్య స్వరమని అంటుంటారు. అందువలన ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి, కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రం చెబుతోంది.
 
సాధారణంగా స్త్రీలు ఇంటికి సంబంధించిన అనేక పనులను చేస్తుంటారు. ఆ కారణంగా వారికి ఎలాంటి శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా ఈ అడ్డబేసరి అడ్డుకుంటుందని చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఆనాటి పెద్దలు, స్త్రీలు తప్పని సరిగా అడ్డబేసరి ధరించాలనే నియమాన్ని పాటిస్తున్నారు. ఆధునిక కాలంలో అడ్డబేసరి స్థానంలో ముక్కుపుడక వచ్చినప్పటికి ఆచారంగా దీనిని ధరించడం వెనకున్న అర్థం ఇదే.

హనుమకు హనుమాన్ ధార అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

రుద్రాక్షలు ధరించి నిద్రించడం.. శృంగారంలో పాల్గొనడం కూడదు

20-09-2018 గురువారం మీ రాశి ఫలితాలు...

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది

కళ్యాణ్‌ రామ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు.. ఏంటది?

సంబంధిత వార్తలు

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది

మైక్రోవేవ్ ఓవెన్లు వాడుతున్నారా.. దీన్ని చదవాల్సిందే?

పరగడుపునే అర లీటరు మంచినీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం