Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్- అనుచితంగా ప్రవర్తించిన సెరెనా విలియమ్స్.. భారీ షాక్

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో ఆమెకు ఊహించని షాక్‌ తగిలింది. శనివారం జరిగిన యూఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్‌ మ్యాచ్‌లో సెరెనా మూడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందు

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (18:10 IST)
అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో ఆమెకు ఊహించని షాక్‌ తగిలింది. శనివారం జరిగిన యూఎస్‌ ఓపెన్‌ మహిళల ఫైనల్‌ మ్యాచ్‌లో సెరెనా మూడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 17,000 యూఎస్‌ డాలర్ల జరిమానాను అసోసియేషన్‌ విధించింది. 
 
కోచ్‌ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని, ఇది నిబంధనలకు విరుద్ధమని చైర్‌ అంపైర్‌ సెరెనాకు హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికలను విభేదించడం, అసహనంతో రాకెట్‌ విరగ్గొట్టడం, తీవ్ర పదజాలంతో చైర్‌ అంపైర్‌ను దూషించినందుకుగాను జరిమానా విధిస్తున్నట్లు అసోషియేషన్‌ పేర్కొంది. 
 
ఇదిలా ఉంటే.. యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ సెరెనాకు జరిమానా విధించినా.. క్రీడల్లో అందరికి సమాన హక్కులు ఉండాలని.. పురుష ప్లేయర్లు చైర్‌ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించనప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సెరెనా గుర్తు చేసింది. 
 
క్రీడల్లో మహిళలకు, పురుషులకు వేరువేరు నిబంధనలు ఉండటం సమంజసం కాదని పలువురు మాజీ క్రీడాకారులు తప్పుపట్టారు. మహిళల టెన్నిస్‌ అసోషియేషన్‌, అభిమానుల నుంచి సెరెనాకు భారీ మద్దతు లభిస్తోంది.
 
మరోవైపు కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్‌ భవిష్యత్‌ టెన్నిస్‌ తార నయోమి ఒసాకా(జపాన్‌) చేతిలో బోల్తా పడింది.

సంబంధిత వార్తలు

కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్

ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్

మంత్రి జోగి రమేష్‌కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!

ప్రశాంతంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్!

23 ఏళ్ల మహిళపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. గాయంపై కారం పొడిని..?

భయపెట్టేలా సన్నీ లియోన్ - మందిర ఫస్ట్ లుక్

బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో టోని కిక్, సునీత మారస్యార్ జంటగా చిత్రం

ప్లేబాయ్. బాధ్యతాయుత అమ్మాయి కథే మనమే చిత్రం

కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం విడుదలకు సిద్ధం

పొట్టెల్ లాంటి చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

తర్వాతి కథనం
Show comments