బిజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై స్కెచ్ వేసిన గులాబీ దండు...

టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూనే, మరోవైపు వ్యక్తిగంతగా కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిన వైరి వర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి, తిరిగి వారు శాసనసభలో అడుగుపెట్టనీయరాదనే రీతిలో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కొండగల్ నియోజకవర్గానికి ప్రాతి

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:51 IST)
టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూనే, మరోవైపు వ్యక్తిగంతగా కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిన వైరి వర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి,  తిరిగి వారు శాసనసభలో అడుగుపెట్టనీయరాదనే రీతిలో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కొండగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డిపై కన్నేసిన టీఆర్ఎస్, తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పక్కా స్కెచ్ వేసింది. 
 
రాజాసింగ్ గోషామహల్ అసెంబ్లీ నియోజికవర్గానికి బిజెపి నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు. హిందూవాదిగా నిత్యం వివాదాలతో సావాసం చేసే రాజాసింగ్ గో సంరక్షణ, గోవధకు వ్యతిరేకంగా పలు పోరాటాలు చేశారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ పలుమార్లు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. దీంతో రాజాసింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ శాసనసభలో అడుగు పెట్టనీయరాదనే వ్యూహంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌తో పాటు ఎంఐఎం ఇందుకు ప్రణాళిక రచించినట్టు సమాచారం. 
 
రాజాసింగ్‌కు చెక్ పెట్టడానికి దానం నాగేందర్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులతో పోల్చితే నాగేందర్ కచ్చితంగా బలమైన అభ్యర్థే.. గతంలో మూడుసార్లు గెలిచిన ఆసిఫ్ నగర్ పాత నియోజకవర్గంలోని మూడు డివిజన్లు ప్రస్తుతం గోషామహల్లో ఉండటం నాగేందర్‌కు కలిసొచ్చే అంశం. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గోషామహల్ నుంచి  బరిలోకి దిగడం దాదాపుగా ఖామమైంది. ముగ్గురు హేమాహెమీలు ఎన్నికల పోరులో తలపడితే ఫలితం ఎలా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నాయకులారా తస్మాత్ జాగ్రత్త.. నాలుక తెగ్గోస్తాం... మీసం మెలేసిన పోలీస్...

వినాయకుడు అందంగా వున్నాడని చూసేందుకు వెళ్తే.. ఆ మండపం వెనుక?

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

కోవై ఎస్ఎన్ఎస్ అకాడమీ ఎండీ రాసలీలలు.. ఆ యువతి వద్దంటున్నా?

నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...

తర్వాతి కథనం