అర‌వింద స‌మేత ఆడియో క్యాన్సిల్... ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కి చంద్రబాబు, బాలయ్య

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అర‌వింద‌స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ పైన అన

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (14:04 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అర‌వింద‌స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ పైన అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్ఎస్. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆడియోను ఈ నెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న క్యాన్సిల్ అయ్యింది.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ వేడుక‌ను రాయ‌ల‌సీమ‌లో కానీ.. ఆంధ్ర‌లో కానీ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ వేడుక‌కు అనుకోని అతిథులు బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతార‌ని తెలిసింది. ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. అక్టోబ‌ర్ 1 నుంచి 10 లోపు ఈ వేడుక ఉంటుంద‌ట‌. అక్టోబ‌ర్ 11న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, బాల‌య్య‌, చంద్ర‌బాబు.. ఈ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే నంద‌మూరి అభిమానుల‌కు నిజంగా పండ‌గే.

రాజేంద్ర‌ప్ర‌సాద్ బేవ‌ర్స్.. ఇది నిజంగా నిజం.!

హీరో మోహన్ బాబుకు మాతృవియోగం

అశ్వ‌నీద‌త్ సంస్థ నుంచి రానున్న భారీ చిత్రాలు ఇవే..!

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో జనసేన జెండా

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

కోహ్లీ ఆడకుంటే ఎలా..? స్టార్ స్పోర్ట్స్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన బీసీసీఐ

మేరీకోమ్ అదుర్స్.. పోలాండ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం

తర్వాతి కథనం