ఎక్కడ ఎలాంటి ప్రశ్న అడగాలో తెలియదా? దీపికా పదుకునే ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకునేకు కోపం వచ్చింది. మీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై దీపికా మండిపడింది. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దీపికాకు కోపం తెప్పించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..? బాలీవుడ్ స్టా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (18:02 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకునేకు కోపం వచ్చింది. మీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై దీపికా మండిపడింది. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దీపికాకు కోపం తెప్పించింది.


ఇంతకీ విషయం ఏమిటంటే..? బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న దీపికా పదుకోనే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకోనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. నవంబర్‌లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇద్దరూ అధికారిక ప్రకటన చేయలేదు.
 
తాజాగా దీపికా మానసికంగా ఎదురయ్యే ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించింది. తను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి కూడా ఈ సదస్సులో వెల్లడించింది. మహిళలు తమకంటూ కొంత సమయం కేటాయించాలని, తమకి నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉండాలని సూచించింది. ఈ సదస్సులో దీపికకు తన పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఓ జర్నలిస్ట్ నుంచి ఎదురైంది. 
 
రణ్‌వీర్‌తో మీ పెళ్లి గురించి చెప్పండి అంటూ ఓ జర్నలిస్ట్ దీపికను ప్రశ్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన దీపిక ''ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ఇవేనా'' అంటూ సదరు జర్నలిస్ట్‌కి ఎదురుప్రశ్న వేసింది.

బాలీవుడ్‌లో శ్రీదేవి కూతురు జాహ్నవి హాట్ భామగా క్రేజ్

అశ్వ‌నీద‌త్ సంస్థ నుంచి రానున్న భారీ చిత్రాలు ఇవే..!

డైరెక్టర్లు, నిర్మాతల ఇళ్ళలోకి వెళ్లిపోతున్న నాని.. ఎందుకు..?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో జనసేన జెండా

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

కోహ్లీ ఆడకుంటే ఎలా..? స్టార్ స్పోర్ట్స్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన బీసీసీఐ

మేరీకోమ్ అదుర్స్.. పోలాండ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం

తర్వాతి కథనం