శైల‌జారెడ్డి అల్లుడు... వెన్నెల కిషోర్ కామెడీపై నమ్మకం పెట్టుకున్నారట...

అక్కినేని నాగ‌చైత‌న్య - మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన నాగ‌వంశీ నిర్మించారు. చైతు స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తే... అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. అ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (13:00 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య - మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన నాగ‌వంశీ నిర్మించారు. చైతు స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తే... అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. అయితే... ఈ సినిమాని ఆగ‌ష్టు 31న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ.. కేర‌ళ వ‌ర‌ద‌లు కార‌ణంగా రీ-రికార్డింగ్ చేయాల్సిన గోపీ సుంద‌ర్ త‌న ఫ్యామిలీ వ‌ర‌ద‌ల్లో చిక్కుకుందంటూ వ‌ర్క్‌కి బ్రేక్ ఇవ్వ‌డంతో మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ చేసారు.
 
ఈ టైమ్‌లో శైల‌జారెడ్డి అల్లుడు సినిమాని నాగ్‌కి చూపించార‌ట‌. సినిమా చూసిన నాగార్జున కొన్ని మార్పులుచేర్పులు చెప్పాడ‌ట‌. నాగ్ చెబితే చేయాల్సిందే క‌దా. డైరెక్ట‌ర్ మారుతి నాగ్ సూచ‌న‌ల మేర‌కు కొన్ని రీషూట్స్ చేయ‌డం.. కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేయ‌డం జ‌రిగింద‌ట. ముఖ్యంగా వెన్నెల కిషోర్ పైన 8 నిమిషాల కామెడీ సీన్ యాడ్ చేసార‌ట. అది బాగా పండింద‌ట‌. సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది అని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. వీరి న‌మ్మ‌కం నిజం అవుతుందో లేదో ఈ నెల 13న తెలుస్తుంది.

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

పెళ్లికి ముందే గర్భందాల్చిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

'ఎన్టీఆర్ బయోపిక్‌' ఓవర్సీస్ రైట్స్ కోసం పోటాపోటీ

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

చిన్నారుల జ్ఞాపకశక్తిని పెంచుటకు కోడి గుడ్డు..?

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం