స్టార్ డైరెక్టర్ అవకాశాన్ని కాలితో తన్నేసిన విజయ్ దేవరకొండ..?

విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల భారీ హిట్‌తో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. టాలీవుడ్‌లోనే కాదు మిగిలిన సినీపరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు బాగానే పెరిగిపోయారు. అలాంటి విజయ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (21:11 IST)
విజయ్ దేవరకొండ ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల భారీ హిట్‌తో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. టాలీవుడ్‌లోనే కాదు మిగిలిన సినీపరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు బాగానే పెరిగిపోయారు. అలాంటి విజయ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేశాడట. ఎందుకు విజయ్ అలా చేశాడు.
 
విజయ్ మణిరత్నం మూవీని రిజక్ట్ చేశాడా. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. నవాబ్ మూవీలో గోల్డెన్ ఛాన్స్ వద్దన్నాడట. శింబు ప్లేస్‌లో ముందు విజయ్‌ను అనుకున్నారట. మణిరత్నం సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ కనిపిస్తుంటుంది. సినిమా చూస్తుంటే కళాఖండాన్ని తలపిస్తుంటుంది. అందుకే సినీ ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంది. ఇప్పుడు మణిరత్నం తీస్తున్న నవాబ్ మూవీ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తమిళం, తెలుగులో నవాబ్ మూవీ విడుదల కానుంది.
 
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. ఇందులో అరవిందస్వామి, విజయ్ సేథుపతి, శింబు, జ్యోతిక లాంటి స్టార్ నటీనటులున్నారు. బాగా గ్యాప్ తీసుకుని సినిమాలు తీయడం మణిరత్నంకు అలవాటు. మొదట్లో ప్రేమ కథా చిత్రాలే తీసిన మణిరత్నం ఇప్పుడు యాక్షన్ సినిమా నవాబును తీస్తున్నారు. ఈ సినిమాతో పాత మణిరత్నం కనిపిస్తాడన్న ప్రచారం సినీపరిశ్రమలో జరుగుతోంది.
 
చాలామంది స్టార్ నటులకు మణిరత్నం సినిమాలో చేయడం ఓ కళ. స్టార్‌ అనే విషయాన్ని పక్కనబెట్టి మణిరత్నం సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటిది శింబు స్థానంలో విజయ్ దేవరకొండను సినిమాలో నటించమని మణిరత్నం చెబితే చేయనన్నాడట. ఇప్పుడు తాను యాక్షన్ సినిమాల్లో నటించే పరిస్థితులలో లేనని, అలా నటిస్తే తనపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉందని మణిరత్నంకు ముఖం మీద చెప్పేశాడట విజయ్ దేవరకొండ. దీంతో శింబును ఆ స్థానంలో ఉంచి సినిమాను తీస్తున్నాడు మణిరత్నం. ట్రైలర్ రన్ అదిరిపోవడంతో ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడట విజయ్ దేవరకొండ. మణిరత్నం సినిమాలో నటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నాడట.

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ కౌశల్... కత్తి మహేష్ సంచలనం

ఆయన నా భర్త.. కాదు నా మొగుడు.. కన్నడ నటుడి కోసం రోడ్డెక్కిన ఇద్దరు భార్యలు

ఆ సీన్స్ లీకయ్యాయని అమ్మ చెప్పింది.. అంతే పిచ్చెక్కిపోయింది: రాధికా ఆప్టే

ఆంధ్రా బ్యాంకుకి పంగనామం... రూ. 5 వేల కోట్లు ఎగనామం...

రైళ్లలో దోపిడీకి యత్నిస్తే కాల్చివేత: జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సమావేశంలో నిర్ణయం

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు.. ఆసియా కప్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

తర్వాతి కథనం