అబ్బో... సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నారు బిగ్ బాస్...

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఫైనల్‌కు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. సీజన్ 1లో "నా మాటే శాసనం" పేరుతో ఇచ్చిన టాస్క్‌ను ఈ సీజన్‌లో పేరు మార్చి "రిమోట్ కంట్రోల్" అని ఇచ్చారు. ఈవారం లగ్జరీ బ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:59 IST)
నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఫైనల్‌కు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. సీజన్ 1లో "నా మాటే శాసనం" పేరుతో ఇచ్చిన టాస్క్‌ను ఈ సీజన్‌లో పేరు మార్చి "రిమోట్ కంట్రోల్" అని ఇచ్చారు. ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇదే. దీని ప్రకారం బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది కంటెస్టెంట్స్. స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటివి ఏది చెప్పినా రూల్స్ అతిక్రమించకుండా ఫాలో అవ్వాలని సూచించారు బిగ్ బాస్. 
 
మొదట హౌస్‌మేట్స్ అందరూ సరదాగా ఆడుకున్నారు. రోల్ ఫ్రీజ్‌లో ఉండగా అతని నోట్లో యాపిల్ ముక్కలు పెట్టడం, ముఖం నిండా లిప్‌స్టిక్ పూయడం వంటివి చేసి నవ్వుల పూలు పూయించారు. ఇందులో మరింత సెంటిమెంటల్ టచ్ ఇస్తూ సామ్రాట్‌ను ఫ్రీజ్‌లో ఉంచి, తన తల్లిని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. తల్లిని చూసి ఎమోషనల్ అయ్యారు సామ్రాట్. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి తన దీవెనలు అందించి, కౌశల్ దగ్గరకెళ్లి సీరియస్ బాయ్.. అందరితో కలిసి ఉండు ఎప్పుడూ ఒక్కడివే ఉండకు అనగానే ఆమె కాళ్లకు మొక్కి, మిమ్మల్ని చూస్తుంటే నా తల్లి గుర్తుకు వస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఇప్పుడు నువ్వంటే ఏంటో జనానికి తెలిసిందని.. నీ గురించి బయట ఇక ఎవ్వరికీ నా కొడుకు మంచోడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా బిగ్ బాస్ చేశాడన్నారు. నువ్ టైటిల్ గెలవకపోయినా పర్లేదని.. ఒక వేళ గెలిస్తే అది నీకు బోనస్ లాంటిదే అన్నారామె. సామ్రాట్ తల్లి వెళ్లగానే అమిత్ కొడుకు, భార్య హౌస్‌లోకి వచ్చారు. అమిత్ కొడుకు ముద్దుముద్దు మాటలకు బాగా ఎంజాయి చేసారు. ఆ తర్వాత భార్య కూడా రావడంతో అమిత్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. నెక్స్ట్ ఎవరొస్తారని ఎదురుచూస్తుండగా దీప్తి నల్లమోతు కొడుకు వచ్చాడు. చాలారోజుల తరువాత కొడుకుని చూసిన దీప్తి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఇంతలోనే స్టోర్ రూమ్‌లో ఆమె భర్త ప్రత్యక్షమయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో కౌషల్ ఫ్యామిలీ ఎంటర్ అవుతున్న ప్రోమోను వదిలారు.

విజయ్ దేవరకొండ ముద్దులు చూసి దణ్ణం పెట్టిన హీరోయిన్...

సన్నీలియోన్‌కు విశాల్ సపోర్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు

గొడుగు కిందకు రమ్మంటే వచ్చి ఆ పని చేశాడు... ఏం చేయాలి?

ఎన్నారై భర్తలకు కేంద్రం ఝులక్... ఏం చేసిందో తెలుసా?

సంబంధిత వార్తలు

నగరి ప్రజలకు పుట్టినరోజునాడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోజా.. ఏంటది..(Video)

ప్రశ్నించినందుకే చంపాలని చూశారు: జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం

ముఖ్యమంత్రి కెసిఆర్‌కి బిజినెస్ రిఫార్మర్ అవార్డు... అందుకున్న మంత్రి కేటీఆర్(Video)

కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం వుంటే తెదేపాకు ఎందుకు? ఎవరు?(Video)

ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్యాభర్తల నాటకం... ఏజెంట్‌తో వివాహేతర సంబంధం...

''సాహో'' మేకింగ్ వీడియో.. కోట్లు సంపాదించి పెడుతోంది.. ఎవరికి?

సన్నీలియోన్‌కు విశాల్ సపోర్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

నందితాశ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ ప్రయాణం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఏమిటి నీ ధైర్యం..? రోబో 2.0తోనే పెట్టుకుంటావా?

టాక్సీవాలా రివ్యూ రిపోర్ట్.. దెయ్యం కారుతో రైడ్స్ చేసిన అర్జున్ రెడ్డి

తర్వాతి కథనం