బిగ్ బాస్-2.. గీతా మాధురి కోసం వారం రోజులు పొడిగించనున్నారా?

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్-2 ఆదివారంతో 92 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న నేపథ్యంలో, సిల్లీ ఫెలోస్ సినిమా హీరోలు బిగ్ బా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:44 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్-2 ఆదివారంతో 92 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న నేపథ్యంలో, సిల్లీ ఫెలోస్ సినిమా హీరోలు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు.


సిల్లీ ఫెలోస్ సునీల్, అల్లరి నరేశ్ హౌస్‌లోకి వచ్చి హౌస్ మేట్స్‌తో కొంత సమయం గడిపారు. వారు ఉన్నంతసేపు షో చాలా ఎంటర్టైనింగ్‌గా సాగింది. వారితో కూడా నాని ఓ గేమ్ ఆడించి తనదైన హోస్టింగ్ స్కిల్స్‌తో మెప్పించాడు. 
 
ఇక ఎలిమినేషన్ సమయానికి వచ్చేసరికి ముందుగా దీప్తి నల్లమోతు సేవ్ అయినట్లు నాని ప్రకటించాడు. ఆ తర్వాత కౌశల్ పేరు చెప్పి ఫైనల్‌గా శ్యామల ఎలిమినేట్ అయినట్లు అమిత్ సేవ్ అయినట్లు వెల్లడించగా, ఇదివరకే ఎలిమినేషన్‌ని ఫేస్ చేసిన శ్యామల ఈసారి మాత్రం పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. బయటకి వెళ్లినప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఏమైనా చెప్పాలా అంటూ హౌస్ మేట్స్‌ని అడిగి తెలుసుకుంది.
 
స్టేజ్ మీదకి వచ్చిన శ్యామలని హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై ఒపీనియన్స్ అడిగి తెలుసుకున్న నాని ఈ షోలో టాప్ త్రీలో ఎవరుంటారని ప్రశ్నించగా దానికి శ్యామల.. గీతామాధురి, తనీష్, రోల్ రైడాల పేర్లు చెప్పింది. పోతూ పోతూ బిగ్ బాంబ్ రోల్ రైడాపై విసిరింది. ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ ఏ పని చెపితే ఆ పని చేయాలని శ్యామల తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్2 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోని 106 రోజుల పాటు నడిపించనున్నారు. ఇప్పటికే 92 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు ఈ షోని పొడిగించనున్నారని సమాచారం. కావాలనే బిగ్ బాస్ ఈ విధంగా చేస్తున్నారని టాక్. 
 
ప్రస్తుతం ఆడియన్స్‌లో కౌశల్‌కి క్రేజ్ పెరగడంతో దాన్ని తగ్గించడానికి బిగ్ బాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని దానికోసమే వారం రోజులు షోని పొడిగించనున్నారని టాక్ వస్తోంది. ఈ గేమ్‌లో గీతామాధురిని విజేతగా చేయడానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోందట.

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

4 పాటలతో 'అరవింద సమేత' ఆడియో జ్యూక్‌బాక్స్ ... పెనివిటి సాంగే హైలెట్

ఆఫర్ల కోసం అందాల భామ తేజస్విని... బిగ్ బాస్‌లో అలా అయింది..

విడాకులిచ్చి వేరే యువతిని పెళ్లాడిన భర్త.... వధువుపై గ్యాంగ్ రేప్ చేయించిన మాజీ భార్య

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం