గోరక్షణ పేరుతో దాడులా? ఇడియట్సే ఆ పని చేస్తారు : కంగనా రనౌత్

జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం మ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:41 IST)
జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం ముఖ్యమే. కానీ, వాటిని కాపాడే క్రమంలో తెలివితక్కువగా ప్రవర్తించకూడదు. గోరక్షణ పేరుతో దాడులు చేయడం చాలా తప్పు. ఇడియట్లే అలా ప్రవర్తిస్తారు' అని వ్యాఖ్యానించారు.
 
'ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు గుండె తరుక్కు పోతోంది. ఇది తప్పని అందరూ తెలుసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా లేగదూడలను ఎంతో జాగ్రత్తగా కాపాడేవారు. గోవులను కాపాడే ముందు విలువలని కాపాడాలి. జంతువులను కాపాడుకోవాలనుకోవడం మంచిదే. కానీ, ఆ కారణంతో మనుషులపై దాడి చేయడంలో అర్థం లేదు' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, గో సంరక్షణ పేరుతో ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్‌, హరియాణ రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులపై దాడి చేసి హత్య చేసిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణ. 

దగ్గరుండి మరీ తినిపిస్తాడు.. అక్కడ మాత్రం చంపేస్తాడు.. చెర్రీపై ఉపాసన ట్వీట్

అది ప్రేమ కాదు.. ఈగో.. కసి.. నాదన్న పొగరు : ప్రణయ్ హత్యపై హీరో మంచు మనోజ్

నానిని నాగార్జున అంత మాట అనేశాడా? నేచరుల్ స్టార్ ఓ పిచ్చోడా?

ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...

అరకు ఎమ్మెల్యే కిడారిని ఎందుకు చంపారంటే...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం