నాగార్జున‌కి కోపం వ‌చ్చింది. ఏం చేసాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏదీ మ‌న‌సులో దాచుకోలేడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటాడు. విష‌యం ఏంటంటే.. నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ‌వంశీ ని

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:47 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏదీ మ‌న‌సులో దాచుకోలేడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటాడు. విష‌యం ఏంటంటే.. నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ‌వంశీ నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన శైల‌జారెడ్డి అల్లుడు ఆడియోకు మంచి స్పంద‌న ల‌భించింది. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో చైతుకి అత్త‌గా న‌టించ‌డంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది ఈ మూవీకి. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. శైల‌జారెడ్డి అల్లుడు ప్రి-రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ కోట్ల విజ‌య‌భాస్క‌రరెడ్డి ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కి నాగార్జున‌, నాని ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. అయితే... అక్క‌డ కొంతమంది అభిమానులు శైల‌జారెడ్డి అల్లుడు.. శైల‌జారెడ్డి అల్లుడు అంటూ అరిచారు. ఇది నాగార్జున‌కు న‌చ్చ‌లేదు. అంతే... ఆ విష‌యాన్ని స్టేజ్ పైనే చెప్పేసాడు. 
 
నాగార్జున మాట్లాడుతూ... చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున పెద్ద కొడుకు అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను ఏమాత్రం మొహ‌మాటం లేకుండా చెప్పేసాడు. ద‌టీజ్ నాగార్జున‌.

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

పెళ్లికి ముందే గర్భందాల్చిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

'ఎన్టీఆర్ బయోపిక్‌' ఓవర్సీస్ రైట్స్ కోసం పోటాపోటీ

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

చిన్నారుల జ్ఞాపకశక్తిని పెంచుటకు కోడి గుడ్డు..?

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం