ప్రియాంకా చోప్రా అంటే పిచ్చ... అందుకే తలుపులు మూసి ఆ పని చేశాడు...

ఈమధ్య బాలీవుడ్... అనేకంటే హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి తళుక్కున మెరిశారు. విషయం ఏంటయా అంటే... ఆమె తొడుక్కున్న రింగు ధర గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోని జనం మాట్లాడుకుంటున్నారు. ఆమె చేతికి వున్న ఉంగరం ధర అక్షరా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (17:37 IST)
ఈమధ్య బాలీవుడ్... అనేకంటే హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి తళుక్కున మెరిశారు. విషయం ఏంటయా అంటే... ఆమె తొడుక్కున్న రింగు ధర గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోని జనం మాట్లాడుకుంటున్నారు. ఆమె చేతికి వున్న ఉంగరం ధర అక్షరాలా కోటి రూపాయలు అని చెప్పుకుంటున్నారు. తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్‌ను పెళ్లాడబోతున్న ఈ సుందరి తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా ఏర్పాటు చేసిన విందుకు వచ్చింది. 
 
వచ్చింది వచ్చినట్లు వుండకుండా తన స్నేహితులు ఎక్కడ కనబడితే అక్కడకెళ్లి ఫోటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోజుల్లో కూడా తన వేలికి వున్న వుంగరం బాగా ఫోకస్ అయ్యేట్లు చేసింది. దీనితో అంతా ఆ ఉంగరం గురించే అడగడం మొదలుపెట్టారు. ప్రియాంకకు కావాల్సింది కూడా అదే కదా. దాంతో అసలు విషయం చెప్పిందట. అది తన ప్రియుడు, కాబోయే భర్త నిక్ పెట్టిన నిశ్చితార్థ ఉంగరమని వెల్లడించింది. ఆ ఉంగరంలో నాలుగు క్యారెట్ల వజ్రాలున్నట్లు తెలుస్తోంది. 
 
అంతేకాదండోయ్ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసేందుకు నిక్... లండన్ లోని ఓ ప్రముఖ వజ్రాల దుకాణంలోకి వెళ్లి, షాపులోకి ఎవర్నీ రానీయకుండా తలుపులు మూసేశాడట. ఎవ్వరూ రాకుండా అతనొక్కడే తీరిగ్గా కూర్చుని తనకు నచ్చిన ఉంగరాన్ని సెలెక్ట్ చేశాడట. ప్రియాంకా చోప్రా అంటే అతడికి ఎంతో ప్రేమ... పిచ్చి అని అది తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. కాగా ఆగస్టు 18న బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు ఈ బ్యూటీ సిద్ధమయ్యిందని చెప్పుకుంటున్నారు.

పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్... హీరో ఇత‌నే..!

బాబూ.. శ్రీను వైట్ల ఇది నిజ‌మా..?(Video)

ఎన్టీఆర్ బయోపిక్-కృష్ణకుమారిగా మాళవికా నాయర్

చదువుకోసం ఒకే గదిలో ఉంటున్నాం... అతడా పని చేశాడు... ఏం చేయాలి?

వారికి నాతో శృంగారం కావాలి... కానీ నాకు...

సంబంధిత వార్తలు

హిజ్రాతో సహజీవనం చేశాడు.. డబ్బు ఇవ్వలేదని గొంతు కోశాడు.. ఎక్కడ..?

సోష‌ల్ మీడియాను స‌ద్వినియోగం చేసుకుంటే స‌త్ఫ‌లితాలు... కొల్లు ర‌వీంద్ర‌

నిజామాబాద్‌లో దారుణ హత్య... వివాహితను బ్యాగులో కుక్కి.. వాగులో?

ఎయిర్‌టెల్ రేటింగ్ పడిపోయింది.. మూడీస్

తమిళ సర్కారుకు తలొగ్గిన విజయ్ 'సర్కార్' (Video)

దీపికా - రణవీర్ పెళ్లయింది... ఇట్ ఈజ్ అఫీషియల్(ఫోటోలు)

విజయ్ దేవరకొండ ముద్దులు చూసి దణ్ణం పెట్టిన హీరోయిన్...

బిగ్ బాస్-2 విజేత కౌశల్‌కు పీఎమ్ ఆఫీసు నుంచి కాల్ రాలేదట..

అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట..?

''A'' సైట్లను బ్యాన్ చేసినట్లే.. పైరసీని ప్రచారం చేసే..?: విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం