ప్లీజ్.. రష్మిక‌ను విల‌న్‌లా చూడొద్దు: ర‌క్షిత్ శెట్టి

తెలుగు చిత్రపరిశ్రమ సెన్సేషన్ ర‌ష్మికా మంద‌న్న. ఈమె వ్య‌క్తిగ‌త జీవితం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క‌న్న‌డ న‌టుడు, నిర్మాత ర‌క్షిత్ శెట్టితో ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమ సెన్సేషన్ ర‌ష్మికా మంద‌న్న. ఈమె వ్య‌క్తిగ‌త జీవితం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క‌న్న‌డ న‌టుడు, నిర్మాత ర‌క్షిత్ శెట్టితో ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రూ పెళ్లికి సిద్ధ‌ప‌డి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల్లోనే వారిద్ద‌రూ దూర‌మ‌య్యారు. ర‌ష్మిక - ర‌క్షిత్ నిశ్చితార్థం రద్దు అయినట్టు కూడా ర‌ష్మిక త‌ల్లి అధికారికంగా కూడా ప్రకటించారు. అదేస‌మ‌యంలో ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ర‌క్షిత్ ప్ర‌క‌టించారు. ఈ రెండింటినీ ముడిపెడుతూ ర‌క్షిత్‌ అభిమానులు ర‌ష్మిక‌ను ట్రోలింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ ట్రోలింగ్‌ను ఆపాలంటూ ఫేస్‌బుక్ ద్వారా ర‌క్షిత్ విజ్ఞ‌ప్తి చేశారు.
 
'నేను సోష‌ల్ మీడియాకు దూర‌మైంది కొన్ని ముఖ్య‌మైన ప‌నుల‌పై దృష్టి సారించ‌డానికే. కానీ, కొన్ని విష‌యాల్లో క్లారిటీ ఇచ్చేందుకు మ‌ళ్లీ ఫేస్‌బుక్ ద్వారా వెన‌క్కు వ‌చ్చాను. మీ అంద‌రికీ ర‌ష్మిక గురించి కొన్ని అభిప్రాయాలు ఉండి ఉంటాయి. అందులో మీ త‌ప్పు లేదు. అలా ప్రొజెక్ట్ అయింది అంతే. ఒక్కోసారి మ‌నం వినేవి, చూసేవి నిజం కాకపోవ‌చ్చు. నాకు ర‌ష్మిక రెండేళ్ల నుంచి తెలుసు. మీ అంద‌రి కంటే ఎక్కువ‌గా అమె గురించి నాకు తెలుసు. కాబ‌ట్టి ఆమెను జ‌డ్జ్ చేయ‌డం ఆపండి. ఆమెను ప్ర‌శాంతంగా ఉండ‌నీయండి. త్వ‌ర‌లోనే మీ సందేహాల‌న్నింటికీ స‌మాధానాలు దొరుకుతాయి. మీరెవ్వ‌రూ ఈ విష‌యంలో మీడియా వార్త‌ల‌ను ఫాలో కావొద్దు. ఎందుకంటే ర‌ష్మిక‌కు, నాకు సంబంధించిన విష‌యాలేవీ వారికి తెలియ‌దు. అవ‌న్నీ ఊహాగానాలే' అని ర‌క్షిత్ త‌న ఫేస్‌బుక్ పేజీలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు.
 
ఇదిలావుంటే, రష్మిక - రక్షిత్ నిశ్చితార్థం రద్దుకు గల కారణాలపై అనేక రకాలైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. వారిద్ధరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని అందువల్లే ఈ నిశ్చితార్థం రద్దయినట్టు సమాచారం. అయితే, నిశ్చితార్థం రద్దుపై రష్మిక తల్లి ఓ క్లారిటీ ఇచ్చింది. 'ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమైంది. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే చూడాలని ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. కొన్ని సమస్యలతో మా కుటుంబానికి ప్రశాంతత లేకుండా పోయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాం' అని చెప్పుకొచ్చింది. 
 
కాగా, కన్నడలో హిట్టైన 'కిర్రిక్‌ పార్టీ' సినిమాతో రష్మిక, రక్షిత్‌ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2017 జూలై 3న నిశ్చితార్థం జరిగింది. ఇటీవల 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక 'దేవదాసు', 'డియర్‌ కామ్రేడ్' చిత్రాలతో బిజీగా మారిపోయింది. 

జనసేన ఓడిపోయే పార్టీ.. అడ్రెస్ లేని పార్టీ అనమంటావా? బాబూ మోహన్

నేను ఆయనతో వున్నా... మీరు కీప్ అని రాసుకున్నా ఫర్వాలేదంటున్న గాయని

విలన్‌గా నేచురల్ స్టార్.. మరి హీరో ఎవరో తెలుసా..?

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...

మీకెందుకురా పిచ్చిము... కొడకల్లారా కొట్లాట.. దళితులపై చింతమనేని

సంబంధిత వార్తలు

కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననే అమ్మాయిని నీ వెంట తీసుకెళతావా... కె.ఎ.పాల్ పైన యాంకర్ ఫైర్

కేసీఆర్ మాటే శాసనం... హరీశ్-ఈటెలకు మొండిచెయ్యేనా? గోళ్లు కొరుకుతున్నారు...

బాంబులతో కాదురా... బాలయ్య కంటిచూపుతో చంపేస్తాడు... పాక్ ప్రధానికి బాలయ్య ఫ్యాన్ పోస్ట్

మాంసాహారంతో మధుమేహం తప్పదు..

మరో 19 రోజుల్లో వివాహం... బాంబు నిర్వీర్యం చేస్తూ అనంతలోకాలకు...

ఇద్దరు 'బిల్లా'లు ఒకేచోట.. కలిసి రెండు గంటల పాటు..

రకుల్‌ను వెనుకకు నెట్టి, ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్

'బాహుబలి'పై మనసుపడిన తమిళ హీరో డాటర్.. ఐ లవ్ వ్యూ చెప్పాలని వుంది..

అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం టైటిల్ ఇదే...

తెలుగు 'విశ్వాసం' చిత్రం విడుదుల తేదీ ఖరారు..!

తర్వాతి కథనం