నా భార్య గర్భస్రావానికి అతనే కారణం.. హిందీ నటుడు

బాలీవుడ్ నటుడు సుమీత్ సచ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ప్రహ్లాద్ అద్వానీయే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:36 IST)
బాలీవుడ్ నటుడు సుమీత్ సచ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ప్రహ్లాద్ అద్వానీయే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
తన భార్య అమృత గుజ్రాల్ గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ప్రహ్లాద్ అద్వానీయే కారణమని హిందీ టీవీ, సినీ నటుడు, సుమీత్ సచ్‌దేవ్ ఆరోపించాడు. ఈ మేరకు పిటిషన్ ఫైల్ చేశాడు. ప్రసూతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఎటువంటి కారణం లేకుండానే ప్రహ్లాద్.. అమృతపై ఆగ్రహం వ్యక్తం చేశాడన్నాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గర్భం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
సుమీత్ సచ్‌దేవ్ భార్య అమృత గుజ్రాల్ ఓ కంపెనీలో పని చేస్తోంది. ఈ కంపెనీ అధిపతిగా ప్రహ్లాద్ అద్వానీ కొనసాగుతున్నారు. అయితే, అమృత ప్రసూతి కోసం చెల్లింపు సెలవులు (ప్రివిలేజ్ లీవ్) లేకపోవడంతో ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతి కోరింది. దీనికి తొలుత అనుమతించి ఆ తర్వాత అద్వానీ ఆ సెలవులను రద్దు చేశాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఇది భౌతిక దాడి కంటే ఘోరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మానసిక ఒత్తిడి గర్భ విచ్ఛిత్తికి కారణమైందని ఆయన ఆరోపించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

నీ రాసలీలల వీడియోలు నా దగ్గరున్నాయ్... పెట్టేస్తా: శ్రీరెడ్డికి నెటిజన్ వార్నింగ్

ప్రియాంకా చోప్రాకు దీర్ఘకాలిక వ్యాధి.. అదేంటంటే?

ఇంకా పరువు హత్యలేంట్రా జంగిల్ ఫెల్లోస్... హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?

శ్రీమంత ఎమ్మెల్యేల్లో జగన్ నంబర్ 5...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ఆసియా కప్ టోర్నీ- షెడ్యూల్ ఇదే.. రికార్డుల కోసం రోహిత్ సేన రెఢీ

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

తర్వాతి కథనం