పేపర్ బాయ్.. ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎలా వుంటుంది..?

ఓ పేపర్ బాయ్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు... చివరికి ఇద్దరు కలుస్తారా లేదే అనేది సినిమా సారాంశం. మేఘా (తాన్యా హోప్)కి నిశ్చితార్ధం జరిగే రోజున తనొక జబ్బుతో బాధ పడుతుందని తెలుస్తుంద

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:24 IST)
సినిమా పేరు : పేపర్ బాయ్ 
నటీనటులు: సంతోష్ శోభన్, తాన్యా హోప్, రియా సుమన్ తదితరులు 
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ 
దర్శకత్వం: జయ శంకర్
సంగీతం: భీమ్స్ 
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ 
ఎడిటింగ్: తమ్మిరాజు 
కథ-మాటలు: సంపత్ నంది 
 
రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటిన సంపత్ నంది నిర్మాతగా మారారు. సంపత్ నంది తాజాగా అందించిన కథను సినిమాగా తెరకెక్కించారు.. జయశంకర్. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే..  
ఓ పేపర్ బాయ్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు... చివరికి ఇద్దరు కలుస్తారా లేదే అనేది సినిమా సారాంశం. మేఘా (తాన్యా హోప్)కి నిశ్చితార్ధం జరిగే రోజున తనొక జబ్బుతో బాధ పడుతుందని తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే చనిపోతుందని తేలిపోతుంది. 
 
ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతారు. అయితే తన జీవితానికి ఓ పర్పస్ వుంటుందని, తన కారణంగా ఏదొక పని జరగడానికే దేవుడు పుట్టించాడని నమ్ముతుంది. ఈ క్రమంలో మేఘాకు ఒక డైరీ దొరుకుతుంది. అందులో రవి అనే పేపర్ బాయ్ తన ప్రేమకథను రాసుకుంటాడు. పేపర్ బాయ్ అయినప్పటికీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం  వెతుకుతుంటాడు.
 
ఇంతలో అతడు రోజూ పేపర్ వేసే ఇంట్లో ధరణి (రియా సుమన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రవి నిజాయితీ నచ్చి ధరణి కూడా అతడిని ఇష్టపడుతుంది. ధరణి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ రవి పేదవాడని తెలిసి కూడా ప్రేమిస్తుంది. 
 
తమ ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పి వాళ్లని కూడా ఒప్పిస్తుంది. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. కానీ ఉన్నట్టుండి రవి ధరణికి దూరమవుతాడు. రవి ఎక్కడకి వెళ్లాడో తెలియక ధరణి అతడి కోసం ఎదురుచూస్తూ ఉండిపోతుంది. అసలు రవి బ్రతికే ఉన్నాడా..? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి రవి ఎందుకు దూరం కావాలనుకున్నాడు..? వీరిద్దరినీ మేఘా ఎలా కలిపింది..? అనేదే సినిమా. 
 
విశ్లేషణ: 
ఓ గొప్పింటి అమ్మాయి, తనకన్నా తక్కువ స్థాయి అబ్బాయిని ప్రేమించడం.. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించినా.. అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడనే పాయింట్‌ని కొత్తగా చూపించారు. కొంతవరకు ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ప్రేమకథల నుండి ఏమైతే ఆశిస్తామో.. ఈ సినిమాలో అది మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. 
 
ఇద్దరి మధ్య లవ్ స్టోరీని తెరపై ఇంకా బాగా చూపించివుంటే బాగుండేదని అనిపించింది. ఇక హీరోయిన్ హీరోల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం యావరేజ్‌గా అనిపిస్తుంది. సంపత్ నంది రాసుకున్న కథ, డైలాగ్స్ రొటీన్‌గా ఉన్నప్పటికీ దర్శకుడు జయశంకర్ మేకింగ్‌ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో సంపత్ నంది మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.
 
ఈ సినిమాకు మెయిన్ అసెట్స్ సంగీతం, సినిమాటోగ్రఫీ. మెలోడీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. అనవసరపు ట్రాక్ లను జోడించి సినిమాను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. 
 
బిత్తిరి సత్తిపై యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయడం ఓవర్‌గా అనిపిస్తుంది. నటుడిగా సంతోష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇద్దరు హీరోయిన్లు తెరపై అందంగా కనిపించారు. మిగిలిన పాత్రలు తమ పరిధుల్లో బాగానే నటించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా పేపర్ బాయ్ నిలుస్తాడని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
పెర్‌ఫార్మెన్స్- సంతోష్ శోభన్ నటన మెప్పించింది. రియా సుమన్ హీరోయిన్‌గా ఆకట్టుకుంటుంది. అలాగే పోసాని కృష్ణమురళి పాత్ర అందరినీ ఎంటర్‌టైన్ చేసింది. సంపత్ నంది నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం, సంగీతం బాగుంది. 
 
రేటింగ్: 2.5/5

'సైరా నరసింహారెడ్డి' భార్య సిద్ధమ్మ టీజర్‌ను చూశారా...(Teaser)

అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట..?

డీఎస్పీ దూకుడుకు ముకుతాడు.. త్వరలో పెళ్లి .. వధువు ఎవరో తెలుసా?

గోషా మహల్ నుంచి.. ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి.. రాజా సింగ్‌పై పోటీ...

టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ.. కపిల్ దేవ్

సంబంధిత వార్తలు

నగరి ప్రజలకు పుట్టినరోజునాడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోజా.. ఏంటది..(Video)

ప్రశ్నించినందుకే చంపాలని చూశారు: జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం

ముఖ్యమంత్రి కెసిఆర్‌కి బిజినెస్ రిఫార్మర్ అవార్డు... అందుకున్న మంత్రి కేటీఆర్(Video)

కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం వుంటే తెదేపాకు ఎందుకు? ఎవరు?(Video)

ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్యాభర్తల నాటకం... ఏజెంట్‌తో వివాహేతర సంబంధం...

టాక్సీవాలా సినిమా పైరసీ రాగానే చచ్చిపోయిందనుకున్నా...(Video)

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ బిజినెస్ ఎంతో తెలుసా..?

స్టార్ట్ .. కెమెరా యాక్షన్.. #RRR షూటింగ్ ప్రారంభం

'ఆనంద‌భైర‌వి'గా అల‌రించ‌నున్న అంజ‌లి

డీఎస్పీ దూకుడుకు ముకుతాడు.. త్వరలో పెళ్లి .. వధువు ఎవరో తెలుసా?

తర్వాతి కథనం