బ్రెడ్‌తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు - 7 నూనె - 2 స్పూన్స్ సోంపు - 1 స్పూన్ దాల్చిన చెక్క - చిన్న ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌ - 2 కప్పులు టమోటాలు - 2

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (13:23 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్‌ ముక్కలు - 7 
నూనె - 2 స్పూన్స్ 
సోంపు - 1 స్పూన్  
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
తరిగిన క్యారెట్‌, క్యాప్సికమ్‌ - 2 కప్పులు 
టమోటాలు - 2 
పచ్చిమిర్చి - 3 
కారం - 2 స్పూన్స్ 
పసుపు - 1 స్పూన్ 
గరం మసాలా - 2 స్పూన్స్ 
ధనియాల పొడి - 1 స్పూన్ 
కొత్తిమీర, పుదీన - 1 కప్పు 
పెరుగు - అర కప్పు 
చక్కెర - 1 స్పూన్ 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పెనం మీద కాల్చుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, సోంపు వేసి వేయించి తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పాటు బాగా వేయించి టమోటాలు, ఉప్పు, చక్కెర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

ఆ తరువాత క్యాప్సికమ్‌, క్యారెట్‌, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలిపి చిన్నమంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి బ్రెడ్ బిర్యానీ రెడీ.

మెుక్కజొన్న పులావ్ తయారీ విధానం...

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారి కోసం....

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నారా?

విడాకులిచ్చి వేరే యువతిని పెళ్లాడిన భర్త.... వధువుపై గ్యాంగ్ రేప్ చేయించిన మాజీ భార్య

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

పూరి నెక్ట్స్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారంతే... వర్మలా GST తీస్తారా?

తర్వాతి కథనం