వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్‌కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట మంచినీటి బాటిల్‌ని తీసుకుని దప్పికగా వున్నప్పుడు తాగుతుండాలి.

కేలరీలను తగ్గించడానికి, శరీర బరువును నిర్వహించడానికి చక్కెర పానీయాల కంటే నీటిని ఎంచుకోండి.

శీతల పానియాల కంటే మంచినీటిలో నిమ్మ, లేదా పండ్ల రసాన్ని తాగాలి.

చల్లటి మంచినీటిని తాగాలనుకునేవారు కుండల్లోని మంచినీటిని తాగాలి.

భోజనానికి ముందు గ్లాసు మంచినీటిని తాగాలి.

ఎండలో పనిచేసేవారు ప్రతి 15-20 నిమిషాలకు 1 కప్పు మంచి నీరు త్రాగాలి.

గంటల పాటు సాగే సుదీర్ఘమైన పనుల్లో, చెమట సమయంలో, సమతుల్య ఎలక్ట్రోలైట్స్ కలిగిన స్పోర్ట్స్ డ్రింక్స్ త్రాగాలి.

సాధారణంగా మంచినీరు లేదా జ్యూస్ తీసుకోవడం గంటకు 6 కప్పులకు మించకూడదు.

అధిక కెఫిన్ లేదా చక్కెర ఉన్న ఆల్కహాల్, పానీయాలను నివారించండి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

Follow Us on :-