యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఏం తినకూడదు, ఏం తినాలి?

యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారు క్రమేణా అధికమవుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తితో కాలివేళ్లు, జాయింట్ పెయిన్స్ తదితర సమస్యలు వస్తాయి. ఈ యూరిక్ యాసిడ్ ఏ ఆహారం తింటే వస్తుందో, ఎలాంటి ఆహారం తీసుకుంటే తగ్గుతుందో తెలుసుకుందాము.

credit: social media and webdunia

రొయ్యలు, పీతలు, నత్తగుల్లలు తదితర సముద్ర ఆహార పదార్థాలలోని ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్‌గా విచ్ఛిన్నమవుతుంది.

క్యాలీఫ్లవర్, బచ్చలికూర, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు, ఎండిన కాయధాన్యాలు, బీన్స్ వంటివాటిలో యూరిక్ యాసిడ్ వుంటుంది.

టొమాటోలు రక్తంలో అధిక స్థాయి యూరిక్ యాసిడ్‌ వుంటుంది కనుక వీటిని అధిక మోతాదులో తినరాదు.

అధిక యూరిక్ యాసిడ్ లెవెల్స్‌తో బాధపడుతున్నవారు బెండకాయలను అధిక మోతాదులో తినరాదు.

కీరదోస రసంలో నిమ్మరసం కలిపి త్రాగడం వల్ల రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.

అరటిపండ్లలో ప్యూరిన్లు తక్కువగానూ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ వున్నవారికి మేలు చేస్తుంది.

చెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ సహజంగా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి అద్భుతమైన పండ్లు.

జీడిపప్పు, వాల్‌నట్స్, బాదములు, ఫ్లాక్స్ సీడ్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

దానిమ్మ సిట్రిక్ యాసిడ్ యొక్క గొప్ప మూలం, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కండలు పెంచుకునేందుకు 6 ఆహారాలు, ఏంటవి?

Follow Us on :-