విపరీత కరణి ఆసనం

Webdunia
సంస్కృతంలో విపరీత అనే పదానికి తలక్రిందులు అని అర్థం. అలాగే కరణి అంటే క్రియ... చేసే పని. ఈ పద్ధతిలో శరీరం తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆసనం వేయటానికి మూడు దశలలో ఒకదానివెంబడి మరొకటి అనుసరిస్తూ వేయాలి.

ఆసనం వేసే పద్ధతి
మీరు ఈ ఆసనం వేయటానికి ముందు చాపపై పడుకోవాలి
మీ రెండుకాళ్లను ఒకదానికొకటి దగ్గరగా జరపండి
రెండు చేతులను ప్రక్కలకు చాపి ఉంచండి
మెల్లగా గాలిని పీల్చుతూ ఆసనం వేయటానికి సంసిద్ధులుకండి
మీ రెండు అరచేతులను భూమికి గట్టిగా ఆనించి ఉంచండి
ఇక మీ రెండు కాళ్లను మెల్లగా భూమికి లంబంగా... అంటే 90 డిగ్రీల కోణంలోకి వచ్చేంతవరకూ పైకి లేపండి.
పైకి లేపిన మీ కాళ్లు మీ తలను చూస్తుండాలి.
అయితే మోకాళ్లను మడవటం కానీ, చేతులను పైకి లేపటం కానీ చేయవద్దు.
ఇలా వేసినతర్వాత గట్టిగా గాలిపీల్చి ఓ ఐదు సెకనులపాటు బిగపట్టండి
ఆ తర్వాత మెల్లగా పీల్చిన గాలిని వదులుతూ ఓ ఐదుసెకనులు ఉండండి
మళ్లీ మెల్లగా గాలిపీల్చటం మొదలుపెట్టండి.. అయితే మరింత గట్టిగా. అలాగే ఐదు సెకనులపాటు బిగపట్టండి ఆ తర్వాత వదిలేయండి.

రెండో దశ
ఇలా గాలి పీల్చి వదలటం పూర్తయిన తర్వాత మళ్లీ యథాస్థానానికి తిరిగి రండి
మీ రెండు అరచేతులను ఆనించి ఉంచండి
చేతులను వంచి నడుము భాగాన్ని పైకి లేపేందుకు సహాయపడేటట్లు జరపండి
రెండు కాళ్లు నిట్టనిలువుగా ఉండేటట్లు పైకి లేపండి
ఈ పద్ధతిలోనూ గాలిని పీల్చి వదలటం చేయాలి
గట్టిగా గాలి పీల్చి ఓ ఐదు సెకనులు బిగపట్టండి
గాలి పీల్చటాన్ని కొనసాగించండి
తిరిగి గాలి పీల్చి ఐదు సెకనులు బిగపట్టండి
మామూలుగా ఊపిరితీసుకుంటూ కొద్ది నిమిషాలు గడపండి
ఆ తర్వాత మూడో దశను అనుసరించండి

అరచేతులను భూమికి గట్టిగా తాకించి ఉంచండి
కాళ్లను తలవైపుకు వచ్చేటట్లు లేపండి. ఇలా చేసేటపుడు మీ తనకానీ, మోకాళ్లను గానీ పైకి లేపకూడదు.
నడుము క్రింది భాగాన్ని కాస్త పైకి లేపండి
ఈ భంగిమలో వీపు భాగం కాస్త వంగినట్లుగా చేయాలి
ఆ తర్వాత కాళ్లను నేలకు సమాంతరంగా ఉండేటట్లు చూడండి.
మోచేతుల వద్ద మీ రెండు చేతులను మడవండి
ఈ దశలో మీ అరచేతులు శరీరానికి సపోర్ట్‌గా ఉంచండి
రెండు అరచేతులు పైకి లేపి ఉంచిన శరీర భాగాన్ని పట్టి ఉండేలా చేయండి
ఈ భంగిమలో ఓ ఐదు సెకనులపాటు ఉండండి
మెల్లగా గాలిని పీల్చుతూ కాళ్లను భూమికి నిట్టనిలువుగా ఉండేటట్లు చూడండి
ఇలా చేసిన తర్వాత గాలిని పీల్చి ఓ ఐదు సెకనులపాటు బిగపట్టండి
తిరిగి సాధారణంగా ఊపిరిపీల్చటం చేయండి
కాళ్లు, మోకాళ్లు నిటారుగా ఉండేటట్లు చూడండి
ఈ భంగిమలో మూడు నిమిషాలపాటు అలాగే ఉండండి
తిరిగి మెల్లగా మొదటి స్థానానికి వచ్చేయండి

WD
ప్రయోజనాలు
కటి శ్రోణి క్రమబద్దీకరించబడుతుంది.
మెడ, ముఖం, మెదడు గొంతు భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది
శరీర లోపలి వ్యవస్థకు మేలు చేకూర్చుతుంది
పీయూష, థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తుంది.

జాగ్రత్తలు
కాళ్లు 90 డిగ్రీల కోణంలోకి పెట్టిన తర్వాత కాళ్లను ఒక్కసారిగా ముందుకు కదల్చకూడదు. అలాగే మోకాళ్లను మడవటం వంటివి సమస్యలోకి నెడతాయి కనుక ఈ ఆసనం వేసేటపుడు జాగ్రత్తగా ఉండటం అవసరం.

మెుక్కజొన్న పులావ్ తయారీ విధానం...

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారి కోసం....

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నారా?

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

పూరి నెక్ట్స్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారంతే... వర్మలా GST తీస్తారా?