Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి బస్టాండ్‌లో కలకలం.. రెండేళ్ల బాలుడు కిడ్నాప్

arul ramaswamy
, మంగళవారం, 3 అక్టోబరు 2023 (10:21 IST)
తిరుపతి బస్టాండులో సోమవారం అర్థరాత్రి కలకలం చెలరేగింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన చెన్నై దంపతులకు చెందిన రెండేళ్ల కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. తిరుగు ప్రయాణంలో బస్టాండ్‌లో టిక్కెట్ కౌంటర్ వద్ద బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా, ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు పిల్లాడిని అపహరించారు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి బాలుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 
 
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత చెన్నై దంపతులు చెన్నైకు తిరుగు పయానమయ్యారు. వీరు తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండులోని టిక్కెట్ కౌంటర్ వద్ద నిద్రిస్తుండగా అర్థరాత్రి 2 గంటల సమయంలో దుండగులు బాలుడిని కిడ్నాప్ చేశారు. కాసేపటి తర్వాత తల్లిదండ్రులకు మెళకువ వచ్చి చూడగా తమ పక్కలో బిడ్డ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదృశ్యమైన బాలుడి పేరు అరుణ్ రామస్వామి అని, తండ్రి రామస్వామి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఐస్ క్రీమ్ కోసం ఫ్రిజ్ తెరిచిన చిన్నారి మృత్యువాత.. ఎలా?  
 
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో విషాదం జరిగింది. ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి ఒకరు మృత్యువాత పడింది. ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్రీమ్‌ను తీసుకునేందుకు డోర్ తీయగానే ఆమెకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నందిపేట్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటకు చెందిన గూడూరు రాజశేఖర్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి నందీపేట్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళుతుండగా, కుమార్తె రిషిత (4)ఐస్ క్రీమ్ కావాలని మారాం చేసింది. దీంతో స్థానికంగా ఉండే ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. 
 
తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమర్జెన్సీ డోర్ పక్కనే కూర్చొన్న ప్రయాణికుడు.. దాన్ని తెరిచేందుకు యత్నం...!