Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

09-01-2024 గురువారం దినఫలాలు - లక్ష్మీ అమ్మవారిని ఎర్రని పూలతో పూజించి...

Astrology

రామన్

, మంగళవారం, 9 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| త్రయోదశి రా.8.38 జ్యేష్ట రా.7.57 తె.వ.3.49 ల 5.24. ఉ. దు. 8.46 ల 9.30 రా.దు. 10.45 ల 11.37.
లక్ష్మీ అమ్మవారిని ఎర్రని పూలతో పూజించి, అర్చించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. స్త్రీలకు పనివారితో చికాకులు వంటివి తప్పవు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. వైద్యులకు మెళుకువ అవసరం.
 
వృషభం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతీ విషయానికి ఓర్పు, సఖ్యత అవసరం. వైద్య రంగాలవారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలుతప్పవు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పత్రికా వార్త సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. 
 
కర్కాటకం :- ప్రయాణాలు, బ్యాంకు పనులు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మెళకువ వహించండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
సింహం :- దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. క్లిష్టసమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. సొంత వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- ముఖ్యమైన వ్యవహరాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు. ఆర్థిక, కుటుంబ, వ్యాపారా వ్యవహారాల పట్ల ఏకాగ్రత ముఖ్యం. కొత్త పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
తుల :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీవాహనం ఇతరుల కిచ్చేవిషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురై మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తి చేస్తారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పుపొందుతారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోవారికి అనుకూలం. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం. స్త్రీలతో మితంగా సంభాషించటం అన్ని విధాలామంచిది.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. రాత పరీక్షలయందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టతరమవుతుంది. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశంఉంది.
 
మకరం :- పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఒక ఖర్చునిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు.
 
కుంభం :- ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు.
 
మీనం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గశిర మాసంలో శ్రీవారిని పూజిస్తే ఏంటి ఫలితం ఏంటి?