Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-01-2024 ఆదివారం దినఫలాలు - విష్ణుమూర్తిని పూజించి ఆరాధించిన మీ సంకల్పం...

horoscope

రామన్

, ఆదివారం, 14 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ తదియ ప.12.18 ధనిష్ఠ ప.2.51 రా.వ.9.33 ల 11.02. సా.దు. 4.07 ల 4.52.
విష్ణుమూర్తిని పూజించి ఆరాధించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కాగలదు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం, ఆందోళనలు తప్పవు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు ఆశాజనకం.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహరాలు సానుకూలమవుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మిథునం :- కళా, క్రీడా, సాంకేతిక రంగాలలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలులభిస్తాయి.
 
సింహం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు. స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య :- విదేశాలలోని వారికి వస్తు సామాగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. ఉద్యోగస్తులదైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. తరచూ సన్మానాలు సభల్లో పాల్గొంటారు.
 
తుల :- భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో అవకాశం, బహుమతులు అందుతాయి.
 
వృశ్చికం :- దంపతుల మధ్య అన్యోన్యత లోపం, పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. షాపుల అలంకరణ, కొత్త స్కీములతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
ధనస్సు :- సమస్యలకు పరిష్కార మార్గం, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. నూతన దంపతుల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. అదనపు రాబడి, చేబదుళ్ల కోసం యత్నిస్తారు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
మకరం :- మీ సంతానం విద్యా, ఆరోగ్యం విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఐరన్, సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలిసిరాగలదు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గృహంలో మరమ్మతులు అనుకూలస్తాయి. ప్రయాణాల్లో ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహరారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు ఊహించినవే కావటంతో ఇబ్బందులుండవు.
 
మీనం :- ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో ఆగిపోయిన పనులు పున ప్రారంభమవుతాయి. ధనం చేతిలో నిలబడటం కష్టమే. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగాఉండటం క్షేమదాయకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోగి పండుగ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదట!