Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-01-2024 బుధవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

astro11

రామన్

, బుధవారం, 24 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ చతుర్ధశి రా.9.32 ఆరుద్ర ఉ.6.46 రా.వ.7.26 ల 9.08.
ప. దు. 11.43 ల 12.26.
లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి బకాయిల వసూలు విషయంలో సమస్యలు తప్పవు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మీ మనోభావాలు బయటికి వ్యక్తం చేయకండి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
 
వృషభం :- వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మిథునం :- పత్రికా రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. ఎలక్ట్రికల్ రంగాలలో వానికి సామాన్యంగా ఉండగలదు. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పొందగలవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు శ్రమాధిక్యత చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలు వాగ్వివాదాలకు, అనవసరవిషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులు తోటి పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
 
తుల :- కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి.
 
వృశ్చికం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపాకాలు అధికమవుతాయి. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టకపోవడం మంచిది.
 
ధనస్సు :- స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. సభ, సమావేశాలలో పాల్గొంటారు. వైద్యులను మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో చికాకులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. నూతన రుణా కోసం అన్వేషిస్తారు. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు పరిష్కారదిశగా ముందుకు కొనసాగుతారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి.
 
కుంభం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో రామమందిరం.. 48 రోజులు సుందరకాండ చదివితే?