Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారం పరుగులు... మధ్యతరగతి గుండెల్లో గుబులు

బంగారం పరుగులు... మధ్యతరగతి గుండెల్లో గుబులు
, బుధవారం, 30 జనవరి 2019 (12:23 IST)
కొత్త సంవత్సరం మొదలైనప్పటికీ బంగారం, వెండి ధరలలో అంతకంతకీ పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పాజిటివ్ ట్రెండ్ ఉండటం వలన బంగారం ధర పెరుగుతున్నట్లు ట్రేడర్లు చెప్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,300 డాలర్ల పైన ఉంటోంది. మంగళవారం కూడా బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.33,750 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.33,600 వద్ద ముగిసింది.
 
కేజీ వెండి ధర రూ.200 పెరగడంతో రూ.41,000కి చేరింది. ఇక 100 వెండి నాణేల క్రయవిక్రయాల విషయానికొస్తే కొనుగోలు ధర రూ.78,000 వద్ద, అమ్మకం ధర రూ.79,000 వద్ద స్థిరంగా కంటిన్యూ అవుతున్నాయి. 
 
ఏపీ బులియన్ బోర్డులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,980గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.41,200కి పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,020గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.43,600గా పలుకుతోంది. ఇక చెన్నై విషయానికొస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,920, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,450, కేజీ వెండి ధర రూ.43,600.
 
మిగతా దేశాలలో బంగారం అనేది కేవలం పెట్టుబడి. కానీ భారతదేశంలో, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం అనివార్యమైన పరిస్థితులలో పెరుగుతున్న ధరలను చూసి మధ్య తరగతి ప్రజలు ముందే కొని పెట్టుకోవాలో లేక తగ్గుతుందని ఎదురుచూడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలెంటైన్ డే నాడు వైఎస్ జ‌గ‌న్ నూత‌న గృహ ప్ర‌వేశానికి ముహుర్తం