Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యరశ్మి - జంక్ ఫుడ్స్‌తో కంటి చూపుకు చేటు : డాక్టర్ అమర్ అగర్వాల్

agarwals hospital team
, గురువారం, 17 ఆగస్టు 2023 (22:09 IST)
అధిక సూర్యరశ్మి, జంక్ ఫుడ్స్‌తో కంటి చూపుకు హాని కలుగుతుందని డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ అమర్ అగర్వాల్ అన్నారు. అందువల్ల కంప్యూటర్లపై పని చేసే ప్రతి ఒక్కరూ కనీసం గంటకు ఒకసారైనా నేత్రాలకు విశ్రాంతినివ్వాలని ఆయన కోరారు. ఆయన గురువారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో 1.5 కోట్ల మంది కంటి చూపు లోపంతో బాధపడుతున్నారని, వీరిలో 50 శాతం మంది కంటి పొర సమస్యతో ఉన్నారన్నారు. అమెరికా వంటి అగ్రదేశాల్లో 70 యేళ్ళకు పైబడిన వారికి కంటి పొర సమస్య వస్తుందన్నారు. కానీ, మన దేశంలో చిన్న వయసు నుంచే ఈ సమస్య ఉందన్నారు. దీనికి ప్రధాన కారణాలు రెండన్నారు. వాటిలో ఒకటి అధిక ఉష్ణోగ్రత, రెండోది జంక్ ఫుడ్స్ ఆరగించడమన్నారు. 
 
ఇకపోతే, తమ ఆస్పత్రిని మరింతగా విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం స్వదేశంతో పాటు పలు దేశాల్లో కలిపి మొత్తం 150కు పైగా ఆస్పత్రులు ఉన్నాయని, ఇపుడు ఈ సంఖ్యను 300కు పెంచేలా వచ్చే రెండుమూడేళ్ళలో విస్తరించనున్నట్టు తెలిపారు. తమ ఆస్పత్రి విస్తరణ కోసం టీపీజీ, టెమసెక్ కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాయని తెలిపారు. తొలి దఫాలో రూ.1050 కోట్లు, రెండో దఫాలో రూ.650 కోట్ల మేరకు నిధులను పెట్టుబడిగా పెడుతున్నాయన్నారు. 
 
ఈ నిధులతో స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం మరిన్ని ఆస్పత్రులతో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్స్‌ను స్థాపించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న తమ ఆస్పత్రుల పురోగతి చాలా బాగా ఉందన్నారు. కొత్తగా స్థాపించనున్న ఆస్పత్రులను ముంబై, పంజాబ్, ఎన్.సి.ఆర్ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 
 
అయితే, ఆస్పత్రుల్లో పనిచేసేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు. ఈ సమస్యను అధిగమిస్తూనే తమ ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్ మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన రూ.650 కోట్ల నిధులను కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, విస్తరణ కోసం వినియోగిస్తామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 100 ప్రైమరీ ఐ క్లినిక్స్‌ను రానున్న రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో తాము పబ్లిక్ ఇష్యూకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి ఆస్పత్రి విస్తరణకు పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేషాలచలం అడపుల్లో ఉండేది పరదాల మధ్య తిరిగే పులకేసి కాదు : తెదేపా సెటైర్