Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోగి భద్రత కోసం డోజీతో కలిసి మెడికవర్ హాస్పిటల్స్ స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమం పరిచయం

Medicover Hospitals

ఐవీఆర్

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (17:29 IST)
భారతదేశంతో సహా 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్‌కేర్ పవర్‌హౌస్ అయిన మెడికవర్ హాస్పిటల్, డోజీ యొక్క అత్యాధునిక రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని ఏకీకృతం చేయడం ద్వారా పేషెంట్ కేర్‌లో సంచలనాత్మకమైన ప్రయత్నంగా స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమంను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ పరివర్తన కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ, దేశంలో రోగి భద్రత పరంగా నూతన ప్రమాణాలను నిర్దేశించాలనే  మెడికవర్ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అంతటా అసాధారణమైన మల్టీస్పెషాలిటీ కేర్‌కు పేరుగాంచిన మెడికవర్ హాస్పిటల్స్, రోగుల భద్రత పరంగా నూతన శకానికి నాంది పలుకుతూ డోజీ యొక్క 'మేడ్-ఇన్-ఇండియా' సాంకేతికతను స్వీకరిస్తోంది. రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తామనే భరోసా అందించటానికి అధునాతన డిజిటల్ పరిష్కారాలపై ఆధారపడి, ఆరోగ్య సంరక్షణ యొక్క నూతన ప్రమాణాలను ఏర్పాటు చేసే దిశగా వేసిన కీలకమైన ముందడుగును స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమం సూచిస్తుంది. సాంప్రదాయ ఐసియు సెట్టింగ్‌ల వెలుపల ఉన్న రోగులకు నిరంతర వైటల్స్  పర్యవేక్షణ, ముందస్తు జోక్యాన్ని నిర్ధారిస్తూ, సాంప్రదాయ సరిహద్దులను దాటి విస్తరించాలని ఆసుపత్రి లక్ష్యంగా పెట్టుకుంది.
 
డోజీ యొక్క క్లౌడ్-ఆధారిత సొల్యూషన్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు సౌకర్యవంతమైన కేంద్రీకృత, రిమోట్ పేషెంట్ మానిటరింగ్‌తో సాధికారతను అందిస్తుంది, భద్రత, క్లినికల్ ఫలితాలు, రెండింటినీ మెరుగుపరుస్తుంది. డోజీ యొక్క పేటెంట్ పొందిన ఏఐ -ఆధారిత బల్లిస్టోకార్డియోగ్రఫీ సాంకేతికత కీలకమైన వైటల్స్‌ను రిమోట్‌గా పర్యవేక్షిస్తుంది. ఇది వైద్యపరమైన క్షీణతను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడుతుంది. సత్త్వ యొక్క పరిశోధన సంభావ్య ప్రభావవంతమైన ఫలితాలను సూచిస్తుంది. ప్రతి 100 డోజీ కనెక్ట్ చేయబడిన పడకల కోసం, 144 మంది ప్రాణాలు కాపాడబడతాయని అంచనా వేయబడినది, అలాగే నర్సు పర్యవేక్షణ సమయం 80% తగ్గుతుంది. ఐసియు సగటు నిడివి(ALOS)లో సుమారు 1.3 రోజుల తగ్గుదల రోగి భద్రత, కార్యాచరణ సామర్థ్యంను గణనీయంగా మెరుగుపరుస్తుంది. 
 
"ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా, మా నిబద్ధత చికిత్సకు మించి విస్తరించింది; ఇది రోగి సంరక్షణను పునర్నిర్వచించే ఆవిష్కరణల యొక్క అసాధారణ అన్వేషణను కలిగి ఉంటుంది. డోజీ యొక్క రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని స్వీకరించడం ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించడంలో మా అంకితభావానికి నిదర్శనం" అని మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ అన్నారు.
 
మెడికవర్ హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.శరత్ రెడ్డి కార్డియాలజీ రంగంలో సాంకేతికత యొక్క ప్రభావాన్ని నొక్కిచెప్పారు. ఆయన మాట్లాడుతూ, "కార్డియాలజీ రంగంలో, సమయానుకూలంగా, ఖచ్చితమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది. డోజీ రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ముఖ్యమైన వైటల్స్ నిరంతర ట్రాకింగ్‌ని అనుమతిస్తుంది. రోగి ఆరోగ్యం యొక్క సమగ్ర వీక్షణను అందిస్తుంది. ఈ సాంకేతికత గుండె సంబంధిత రోగులకు సరైన ఫలితాలను అందించడంలో, మొత్తం రోగి భద్రతను మెరుగుపరచడంలో గేమ్-ఛేంజర్‌గా నిలువనుంది" అని అన్నారు. 
 
మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హరి కృష్ణ, హెల్త్‌కేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయడంలో హాస్పిటల్ అంకితభావాన్ని వెల్లడిస్తూ, "స్మార్ట్‌కేర్ మెడికవర్ అనేది హెల్త్‌కేర్ ఆవిష్కరణలో ముందుండాలనే మా నిబద్ధతకు నిదర్శనం. ఇది సాంకేతికతను జోడించడం మాత్రమే కాదు; వ్యూహాత్మకంగా మా రోగులకు సాటిలేని ఆరోగ్య సంరక్షణ అనుభవాన్ని అందించడంలో దానిని ఉపయోగించడం గురించి. దేశంలో రోగుల సంతృప్తి మరియు భద్రత కోసం నూతన బెంచ్‌మార్క్‌లను నిర్దేశించటమే మా లక్ష్యం" అని అన్నారు. 
 
మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా. సతీష్ కుమార్ కైలాసం ఈ కార్యక్రమం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, " మెడికవర్ లో మేము చేసే ప్రతి పనిలోనూ ఆవిష్కరణ అత్యంత కీలకంగా ఉంటుంది. స్మార్ట్‌కేర్ మెడికవర్ అనేది హెల్త్‌కేర్‌కి సంబంధించి ఒక సంపూర్ణమైన విధానం, వాస్తవ-సమయ సమాచారంతో నిపుణులు మన ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగ్గా చేయడంలో సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. ఈ కార్యక్రమం సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం, సౌకర్యవంతమైన, రోగి-కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ ప్రయాణాన్ని సృష్టించడం చేయనుంది" అని అన్నారు.
 
"మెడికవర్ హాస్పిటల్‌తో మా భాగస్వామ్యం ద్వారా రోగుల భద్రత పరంగా మార్గనిర్దేశం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని స్వీకరించడం ఒక పెద్ద ముందడుగు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే  సాధనాలను అందించడం ద్వారా సంరక్షణ ప్రమాణాలు మెరుగు పరచటం మా లక్ష్యం" అని డోజీ సీఈఓ & సహ-వ్యవస్థాపకుడు శ్రీ  ముదిత్ దండ్‌వతె జోడించారు. స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమం వ్యక్తిగతీకరించిన, డేటా ఆధారిత జోక్యాలను అందించడం, ప్రతి రోగి సమయానుకూలంగా, ఖచ్చితమైన శ్రద్ధను పొందాలనే ఆసుపత్రి యొక్క లక్ష్యంతో సమలేఖనం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లీన్ బ్లడ్ కోసం తినాల్సిన పదార్థాలు ఏమిటి?