Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ : మాస్క్‌ను ధరించండి ఇలా!

Mask
, ఆదివారం, 24 డిశెంబరు 2023 (12:34 IST)
మళ్లీ కరోనా వైరస్ బుసలు కొడుతుంది. ఒక్క మన దేశంలోనేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విస్తరిస్తుంది. మన దేశంలో కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తతో వ్యవహరించాలని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రకరకాల మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ మాస్కులేమిటో చూద్దాం.
 
ఎన్‌95
ఈ మాస్కులు వైరస్‌ల నుంచి రక్షణను ఇస్తాయి. ఇవి సర్జికల్‌, గుడ్డ మాస్కుల కన్నా మంచివని నిపుణులు పేర్కొంటున్నారు.
 
గుడ్డ మాస్కులు
మాట్లాడేటప్పుడు నోటి తుంపరలు బయటకు రాకుండా.. జలుబు ఉన్నప్పుడు వైరస్‌ వ్యాపించకుండా ఈ గుడ్డ మాస్కులు ఉపకరిస్తాయి. అలాగే, ఇతరుల నుంచి వైరస్‌లు సోకకుండా కూడా ఇవి ఉపకరిస్తాయి. అయితే వీటిని జాగ్రత్తగా ధరించాలి. ప్రతి రోజు వీటిని ఉతకాలి.
 
సర్జికల్‌ మాస్క్‌లు
ఈ మాస్కులు ఒక్కసారి ధరించటానికి మాత్రమే పనికొస్తాయి. బయట నుంచి వైరస్‌లు రాకుండా ఇవి ఉపకరిస్తాయి.
 
ఫేస్‌ షీల్డ్స్‌
మాస్కులతో పోలిస్తే వీటి ప్రయోజనం చాలా తక్కువ. వీటిని ధరించటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
 
అయితే, ఈ మాస్కులు ధరించే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోండి. అలాగే మాస్కును ధరించినప్పుడు ఎటువంటి ఖాళీలు ఉండకుండా చూసుకోండి ఒక సారి ధరించిన తర్వాత ఆ మాస్కును మళ్లీ తీయరాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో జుట్టును రక్షించుకోవడం ఎలా?