Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే ఇవే లాభాలు

ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే ఇవే లాభాలు
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:26 IST)
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు అంటారు. అదేవిధంగా ఉల్లికాడలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లికాడల్లో అనేక రకములైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఉల్లికాడల్లోని విటమిన్ సి వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది.దీనిలో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేఖంగా పోరడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఉల్లికాడలు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. ఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్‌ అనే ఫ్లవనాయిడ్‌ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
 
2. ఉల్లి కాడల్లో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి. కెలొరీలూ కొవ్వూ తక్కువగా... పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు.
 
3. డైటరీ ఫైబర్‌ అంటే ఆహార సంబంధిత పీచు వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్‌ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
 
4. ఉల్లికాడలు హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గర్భిణిగా ఉండగా తొలి మూడునెలల్లో వీటిని తరచూ తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.
 
5. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఉల్లిపాయ వలె ఉల్లికాడలలో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉన్న సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
 
6. ఈ లేత ఉల్లికాడలలో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఉల్లికాడలలో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. అది విటమిన్ ఎ, విటమిన్ కెని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్‌ని కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో చర్మానికి ఏం చేయాలి..