Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకూతుళ్లపై ప్రియుడి వేధింపులు.. తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

victim woman
, మంగళవారం, 28 నవంబరు 2023 (15:43 IST)
అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మహిళ. ప్రియుడి మోజులో పడి ఆ ప్రియుడు తన కన్న ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడుతుంటే సహకరించింది. ఈ వ్యవహారం కోర్టు దృష్టికి రావటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తల్లికి అత్యంత కఠిన శిక్ష విధించింది. 40 ఏళ్లు జైలు శిక్షను విధిస్తు తీర్పునిచ్చింది కేరళ కోర్టు.
 
పోక్సో చట్టం కింద నమోదు అయిన ఈ కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా కట్టాలని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆమె భర్త వదిలేసి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి వేరుగా నివసిస్తోంది. ఆమెకు శిశుపాలన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
పలుమార్లు తన ఇద్దరు కూతుళ్లను అతడి ఇంటికి తీసుకెళ్లేది. అయితే కిరాతకుడు ఆమె కుమార్తెలను లైంగికంగా వేధించాడు. ప్రియుడి మోజులో పడిన ఆమె తన ఇద్దరు కూతుళ్లను అతని ఇంటికి పంపించేది. దీంతో భరించలేక తల్లికి చెప్పుకున్నా ఫలితం లేకపోయేసరికి ఆ చిన్నారులు తప్పించుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగింది చెప్పారు. 
 
అంతే అమ్మమ్మ అండతో కేసు నమోదు చేయటం శిశుపాలన్‌ను, పిల్లల తల్లిని అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరచటంతో కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
కన్నబిడ్డలపై లైంగిక వేధింపులకు సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 జరిమానా కూడా విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. బాధిత చిన్నారులు ప్రస్తుతం బాలల గృహంలో ఉంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేస్ట్‌గా వండిపెట్టలేదని కన్నతల్లిని కడతేర్చాడు..